News January 19, 2025
KMR: మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు బేసిక్ ఫౌండేషన్ కోర్సులో 4 నెలలు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్ శనివారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలను వచ్చే నెల 15వ తేదీ లోపు కామారెడ్డి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 16, 2025
ఆదోని: ‘రూ.లక్ష విలువ చేసే ఐఫోన్ పోలీసులకు ఇచ్చాడు’

ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామానికి చెందిన కరీమ్ అనే యువకుడు రూ.లక్ష విలువ చేసే ఐఫోన్‌ను శుక్రవారం రాత్రి ఆదోని నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా పడేసుకున్నాడు. దొడ్డనగేరీకి వెళ్లే రహదారిలో చింతకాయల రమేశ్ అనే యువకునికి ఉదయం పొలానికి వెళ్తుండగా దొరికింది. వెంటనే స్థానిక వన్ టౌన్ సీఐ శ్రీరామ్‌కు అందజేసి, బాధితుడికి ఆయన ఆధ్వర్యంలో అందజేశారు. రమేశ్‌ను పోలీసులు అభినందించారు.
News February 16, 2025
చింతలపూడి: బాలికకు జీబీఎస్ లక్షణాలు..UPDATE

చింతలపూడిలోని యర్రగుంటపల్లిలో బాలికకు జీబీఎస్ లక్షణాలు కనిపించగా..విజయవాడ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. బాలిక నుంచి సీఎస్ఎఫ్ నమూనాలను తీసి తుది నిర్ధారణకు చెన్నైకు పంపినట్లు డీఎంహెచ్ వో, డీఈవో తెలిపారు. ఫలితాలు రావడానికి 2 వారాలు పడుతుందని, ప్రస్తుతం బాలిక ఆరోగ్యంగా ఉందన్నారు. బాలిక స్వగ్రామంలో పలువురి నమూనాలను సేకరించగా ఎవరికీ లక్షణాలు లేవని పీహెచ్సీ వైద్యాధికారి నరేశ్ తెలిపారు.