News January 19, 2025

KMR: మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకుల విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి దయానంద్ శనివారం తెలిపారు. జిల్లాలో 6 గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News February 26, 2026

కర్నూలు: హత్య కేసులో నలుగురి అరెస్టు

image

కర్నూలు ఖండేరి వీధికి చెందిన మనోహర్(40) హత్య కేసులో నలుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ వివరాల ప్రకారం.. ఈ నెల 22న పాత బస్టాండ్ సమీపంలోని బార్ వద్ద జరిగిన గొడవలో మనోహర్‌పై పట్టణానికి చెందిన తెలుగు నగేశ్, తెలుగు రాజు, ఎరుకలి రాముడు, తెలుగు ఈరన్న కత్తులు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. నిందితుల నుంచి ఆటో, రెండు కత్తులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపారు.

News February 26, 2026

ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవే!

image

శరీర కండరాల బలం, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ మెరుగవ్వడానికి ప్రొటీన్ ఫుడ్ చాలా అవసరం. చికెన్ బ్రెస్ట్, చేపలు, గుడ్లు, పనీర్, పెరుగు, పప్పుధాన్యాలు, సోయా, బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్, గుమ్మడికాయ గింజల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని డైలీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆకలిని తగ్గించి బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.

News February 26, 2026

సంగారెడ్డి: పెన్షన్ పెంపు కోసం పోరాటం తప్పదు: NPRD

image

సంగారెడ్డి గణేష్ నగర్‌లో ఎన్‌పీఆర్‌డీ(NPRD) 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బసవరాజ్ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య మాట్లాడుతూ.. వికలాంగుల పెన్షన్ పెంపు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వికలాంగుల హక్కుల సాధనకై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.