News January 19, 2025

KMR: మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకుల విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి దయానంద్ శనివారం తెలిపారు. జిల్లాలో 6 గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News July 11, 2025

అమెరికాలో రిచెస్ట్ ఇండియన్ ఇతడే

image

విద్య, ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కొందరు భారతీయులు అక్కడివారిని మించి సంపాదిస్తున్నారు. ‘2025 అమెరికా రిచెస్ట్ ఇమ్మిగ్రెంట్స్ లిస్ట్’ను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో జెడ్‌స్కేలర్ కో ఫౌండర్ జై చౌదరి $17.9 బిలియన్లతో (రూ.1.53 లక్షల కోట్లు) అగ్ర స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వినోద్ ఖోస్లా ($9.2 billion), రాకేశ్ గంగ్వాల్ ($6.6 b), రొమేశ్ టీ వాద్వానీ ($5.0 b), రాజీవ్ జైన్ ($4.8 b) ఉన్నారు.

News July 11, 2025

సత్తెనపల్లి: విచారణకు హాజరుకానున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ

image

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి శుక్రవారం సత్తెనపల్లి పీఎస్‌కు హాజరుకానున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పోలీస్ విధులకు ఆటంకం, దురుసు ప్రవర్తన నెపంతో పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను సత్తెనపల్లి పోలీసులు విచారణకు పిలిచారు. నేడు ఉదయం 11 గంటలకి సత్తెనపల్లి అర్బన్ పీఎస్‌లో విచారణకు రావాలని అంబటికి నోటీసులు జారీ చేశారు.

News July 11, 2025

బీసీ రిజర్వేషన్లతో కాంగ్రెస్‌కు ‘పట్టు’ దొరికేనా?

image

TG: ఎన్నికల హామీ మేరకు BC రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఇటీవల BJPకి BCల మద్దతు పెరిగినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రిజర్వేషన్లు అమలైతే రెడ్డి, SC వర్గాల్లో బలంగా ఉన్న INCవైపు BCలూ మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో రాబోయే స్థానిక ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి బలం పెరుగుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. మీరేమంటారు?