News June 13, 2024

KMR: మౌలిక సదుపాయాల కల్పన పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

image

అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్‌షిప్‌లో మౌలిక సదుపాయాల కల్పన పై అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సమీక్ష నిర్వహించారు. బిటీ రోడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మురుగు కాలువల నిర్మాణం వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు అధికారులు అంచనాలు రూపొందించాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 20, 2025

NZB: CP సాయి చైతన్యపై ప్రశంసల వర్షం

image

CCS కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్‌ను పోలీసులు కాల్చడంతో పోలీసులపై, CP సాయి చైతన్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘హాట్సాఫ్ పోలీస్’ అంటూ పొగుడుతున్నారు. ‘శివ భక్తుడికి కోపం వస్తే.. అసలైన శివ తాండవమే’ అంటూ సీపీ సాయి చైతన్యను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

News October 20, 2025

మెండోరా: నీటిలో మండుతున్న సూర్యుడు

image

సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో సూర్యుడు ఎరుపెక్కిన దృశ్యాన్ని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డ్యామ్‌పై నుంచి చూస్తే నీటిలో నిప్పు కనిక మండుతున్నట్లుగా కనిపించింది. ఈ దృశ్యాన్ని పర్యాటకులు ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్లలో ఫొటోలను చిత్రీకరించారు. నీటిలో నుంచి మండుతున్న అగ్నిపైకి వస్తున్నట్లు ఈ దృశ్యం కనువిందు చేసింది. ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతో పర్యాటక శోభ సంతరించుకుంది.

News October 19, 2025

NZB: 23 వరకు వైన్స్‌లకు దరఖాస్తుల స్వీకారం: ES

image

నిజామాబాద్ జిల్లాలో వైన్స్ షాపులకు సంబంధించి దరఖాస్తులను ఈ నెల 23 వరకు స్వీకరిస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. 27న డ్రా తీస్తారని చెప్పారు. కాగా జిల్లాలోని 102 వైన్స్‌లకు సంబంధించి నిన్నటి వరకు 2,633 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ఇందులో నిజామాబాద్ పరిధిలో 907, బోధన్ 427, ఆర్మూర్ 577, భీమ్‌గల్ 355, మోర్తాడ్ పరిధిలో 366 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.