News June 13, 2024
KMR: మౌలిక సదుపాయాల కల్పన పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్‌షిప్‌లో మౌలిక సదుపాయాల కల్పన పై అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సమీక్ష నిర్వహించారు. బిటీ రోడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మురుగు కాలువల నిర్మాణం వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు అధికారులు అంచనాలు రూపొందించాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 22, 2025
NZB: ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఛైర్మన్‌గా ఈగ సంజీవ్

ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏథిక్స్ డిసిప్లేన్ చైర్మన్‌గా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ ఒక ప్రకటన లో తెలిపారు. సంజీవ్ రెడ్డి ఎంపిక పట్ల జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఛైర్మన్ అంద్యాల లింగయ్యా, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య పలు క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
News March 22, 2025
నిజామాబాద్: ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

లేఔట్ల క్రమబద్దీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ 25 శాతం రాయితీ అవకాశాన్ని నిర్ణీత గడువులోగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఎల్ఆర్ఎస్ సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు. ఎఫ్‌టీఎల్, నిషేధించిన సర్వే నంబర్లు మినహా దరఖాస్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించిందని కలెక్టర్ సూచించారు
News March 22, 2025
NZB: తపాలా వివాదాల పరిష్కారానికి డాక్ అదాలత్

నిజామాబాద్ తపాలా విభాగంలో వివాదాల పరిష్కారానికి మార్చి 25న 49వ డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సూపరింటెండెంట్ జనార్ధన్ తెలిపారు. పోస్టల్ విభాగంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న మనీ ఆర్డర్, స్పీడ్ పోస్ట్, బీమా, ఆర్‌డీ పథకాలు తదితర సమస్యలు సంబంధిత అధికారులు పరిష్కారిస్తారని వివరించారు. ఈ కార్యక్రమాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.