News March 4, 2025
KMR: యాసంగికి సాగు నీరివ్వాలి: సీఎస్

యాసంగి సాగు నీటి సరఫరా, గురుకులాల సందర్శనపై CS శాంతి కుమారి అధికారులతో సోమవారం విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్తో పాటు అధికారులు పాల్గొన్నారు. యాసంగి పంటకు రానున్న పది రోజులు చాలా కీలకమని, విద్యుత్తు సరఫరా అవసరమైన మేర నీరు పంట పొలాలకు చేరేలా చూడాలని CS శాంతి కుమారి ఆదేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల వేట..!

పంచాయతీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీలు వేట ప్రారంభించాయి. వేములవాడ నియోజకవర్గంలోని 129 GPలకు, సిరిసిల్లలోని 5 మండలాల్లో 85, JGTL జిల్లాలో 3 మండలాల్లో 44 GPలు ఉన్నాయి. అన్ని పంచాయతీలకు తొలి విడతలో పోలింగ్ నిర్వహించనుండడంతో నామినేషన్ల దాఖలుకు రెండు రోజుల గడువే మిగిలింది. రిజర్వేషన్ల వల్ల ఆశావహులకు అవకాశం దక్కకపోవడంతో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు.
News November 28, 2025
22 ఏళ్లకే సర్పంచ్.. ఊరిని మార్చేందుకు యువతి ముందడుగు!

డిగ్రీ, పీజీ పూర్తయ్యాక పట్టణాలకు వలసెళ్లకుండా ఊరిని బాగుచేయాలి అనుకునే యువతకు 22 ఏళ్ల సాక్షి రావత్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సర్పంచ్‌గా మారి గ్రామాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని భావించిన సాక్షికి ఊరి ప్రజల తోడు లభించింది. ఉత్తరాఖండ్‌లోని కుయ్ గ్రామ ఎన్నికల్లో ఆమె సర్పంచ్‌గా గెలిచారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణ ఉపాధిపై దృష్టి సారించి.. యువ శక్తితో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.
News November 28, 2025
పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

AP: YCP నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. సరెండర్ కావడానికి 2 వారాల గడువు ఇచ్చింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం వారు గతంలో హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. దీంతో SCని ఆశ్రయించారు.


