News February 11, 2025
KMR: ‘యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం’: షబ్బీర్ అలీ

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ MLC స్థానానికి నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి షబ్బీర్ అలీ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి నరేందర్ రెడ్డిను పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Similar News
News November 27, 2025
లక్ష్మీ నరసింహ స్వామి సేవలో నటుడు రాజీవ్ కనకాల

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామిని గురువారం సినీ నటులు రాజీవ్ కనకాల, బెల్లంకొండ ప్రవీణ్, జబర్దస్త్ అశోక్ దర్శించుకున్నారు. వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు నుంచి ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయ ఈఓ నాగ వరప్రసాద్ వారికి స్వామి వారి ప్రసాదాలు, చిత్రపటాలను అందజేశారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.
News November 27, 2025
పెళ్లికి రెడీ.. అమ్మాయి కావాలి అంతే: చాహల్

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్ ఫొటోలను షేర్ చేసిన ఈ స్పిన్నర్.. ‘నేను పెళ్లికి రెడీగా ఉన్నా. అమ్మాయి కావాలి అంతే’ అని క్యాప్షన్ పెట్టారు. భార్యతో విడాకులు అయితే చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తారని, కానీ చాహల్ కాన్ఫిడెన్స్‌కు మెచ్చుకోవాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News November 27, 2025
ములుగు: ఎన్నికల సమాచారం కోసం కంట్రోల్ రూమ్

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులు, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో 48 సర్పంచ్, 420 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. నిర్వహణ కోసం ఫ్లయింగ్, స్టాటిస్టిక్, వీడియో సర్వేలెన్స్ బృందాలు, ఎంసీఎంసీ, ఎంసీసీ, ఇతర ఎన్నికల సంబంధిత పర్యవేక్షణ అధికారులను నియమించామని చెప్పారు.


