News March 21, 2025
KMR: రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సలహాలు, సూచనలు అందించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా, ఎన్రోల్మెంట్, మార్పులు చేర్పులు, తొలగింపులపై సమావేశం నిర్వహించారు.
Similar News
News April 29, 2025
వినుకొండలో బుల్లెట్ బైకు చోరీ

వినుకొండలో దావూద్ హోటల్ ముందు నిలిపిన (AP 39QQ 1408) రాయల్ ఎన్ఫీల్డ్ జీటీ 650 సీసీ చోరీకి గురైంది. గుర్తు తెలియని యువకుడు హోటల్‌కు వచ్చి టిఫిన్ చేసి కౌంటర్ వద్దకు వచ్చి తనది విజయవాడ అని పరిచయం చేసుకున్నాడు. తనకు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇష్టమని, ఓ సారి ట్రైల్ చూస్తానని చెప్పి తీసుకెళ్లినట్లు బాధితుడు రబ్బాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News April 29, 2025
RTCని కనుమరుగు చేసిన కేసీఆర్: జగ్గారెడ్డి

RTCని కేసీఆర్ కనుమరుగు చేశారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఉచిత బస్సుకు కేసీఆర్ విమర్శిస్తున్నారంటే ఉచిత బస్సు సక్సెస్ అయినట్లేనని తెలిపారు. దీంతో కేసీఆర్‌కు నష్టం కలుగుతుంది కాబట్టే వెస్ట్ అంటున్నారని పేర్కొన్నారు. RTCకి దానికి ప్రాణం పోసిన ఘనత రాహుల్ గాంధీ, అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు.
News April 29, 2025
భద్రకాళి ఆలయంలో కమ్యూనిటీ పోలీసింగ్‌పై అవగాహన

కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు మట్టెవాడ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరానికి గురైన బాధితులు ఎవరిని సంప్రదించాలి, 1930 నంబర్‌కు ఎలా ఫిర్యాదు చేయాలి, మత్తు పదార్థాల వినియోగం, విక్రయం ద్వారా కలిగే నష్టాలను ఎస్ఐ పోచాలు స్థానిక భద్రకాళి దేవాలయంలోని భక్తులకు వివరించారు.