News February 23, 2025
KMR: రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్ కు జిల్లా ఉపాధ్యాయులు

రాష్ట్రస్థాయిలో విద్యా పరిశోధన మండలి ఆధ్వర్యంలో ఈ నెల 28న జరిగే సైన్స్ సెమినార్ కు కామారెడ్డి జిల్లాలోని ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. చిన్న మల్లారెడ్డి భిక్కనూరు బాలుర ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, తుమ్మల రాజు ఎంపిక కావడం పట్ల జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి రాజు అభినందించారు. శాస్త్రీయ వైఖరులను పెంపొందించే విధానాలపై, ఆధునిక బోధన పద్ధతులు రూపొందించారు.
Similar News
News November 26, 2025
పెద్దపల్లిలో కుమారుడి కళ్లను దానం చేసిన తండ్రి

పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫుట్బాల్ ఆడుతూ కిందపడి 10వ తరగతి విద్యార్థి కన్నవేన <<18394891>>ప్రతీక్<<>> మృతి చెందాడు. పెద్దపల్లి, కరీంనగర్ ఆసుపత్రులకు తరలించినా ఫలితం దక్కలేదు. తన కుమారుడు మరణించినా కళ్లు సజీవంగా ఉండాలని ప్రతీక్ తండ్రి కుమారస్వామి నిర్ణయించుకున్నారు. లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ప్రతీక్ రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి దానం చేశారు.
News November 26, 2025
కలెక్టర్ను మైమరిపించిన ఓర్వకల్లు మహిళా రైతు

ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు రాజకుమారిని కలెక్టర్ డా. ఏ. సిరి ప్రశంసించారు. బుధవారం రాజకుమారి పొలంను కలెక్టర్ పరిశీలించి పంటల సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 70 సెంట్ల భూమిలో అంతర పంటల పద్ధతిలో కందులు, అలసందలు, సజ్జలు, మినుములు, గోరు చిక్కుడు, ఆకుకూరలు సాగు చేసి రూ.5 వేల పెట్టుబడితో రూ.60 వేల లాభం సాధించినట్లు రాజకుమారి వివరించారు.
News November 26, 2025
మూవీ అప్డేట్స్

* ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. రిలీజ్కు ముందే కేవలం తెలుగు స్టేట్స్లోనే రూ.130కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది.
*నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK111’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ హిస్టారికల్ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్లో నటిస్తారని టాక్.


