News February 1, 2025
KMR: రుణాల దరఖాస్తు గడువు పొడిగింపు

కామారెడ్డి జిల్లాలో దివ్యాంగులకు జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు రుణాలు మంజూరయ్యాయని, వీటి కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ప్రమీల తెలిపారు. బ్యాంకుతో సంబంధం లేకుండా 100 శాతం రాయితీతో రూ.50 వేల చొప్పున రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే గడువు వచ్చే నెల 12 వ తేదీ వరకు పొడిగించినట్లు ఆమె పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సూచించారు.
Similar News
News March 5, 2025
వరంగల్ జిల్లా నేటి టాప్ న్యూస్

వరంగల్: నేడు మంచినీటి సరఫరాకు అంతరాయంవిద్యుత్ సరఫరాకు ఆటంకం కలగొద్దని సీఎస్ శాంతకుమారి ఆదేశం
వర్ధన్నపేట: నీరు లేక ఎడారిగా మారుతున్న ఆకేరు వాగు
నల్లబెల్లి: నేషనల్ స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థిని
వరంగల్కు కొత్త పోలీసు జాగిలాలు
వరంగల్ అతివేగంగా డివైడర్ని ఢీ కొట్టి వ్యక్తి మృతి
మామునూరు: ఎయిర్పోర్టు భూముల వద్ద ఉద్రిక్తత
News March 5, 2025
కామారెడ్డి: పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్

జిల్లాలో రేపటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం 18469 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 38 సెంటర్లకు గాను 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 38 డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్, 6 సిట్టింగ్ స్క్వాడ్ లను నియమించినట్లు పేర్కొన్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
News March 5, 2025
ఆ మూవీలో ప్రతీ సీన్ గుర్తుంది: సమంత

సినిమా ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినట్లు తెలిపారు. తొలి చిత్రం ‘మాస్కో కావేరి’ షూటింగ్ అంతరాయాల వల్ల పెద్దగా గుర్తులేదన్నారు. ఆ తర్వాత మొదలైన ‘ఏమాయ చేశావే’లో అన్ని సీన్లు గుర్తున్నట్లు చెప్పారు. ఆ సినిమాలోని ప్రతి డీటెయిల్ ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. ఆ స్థాయిలో సంతృప్తి ఇచ్చిన పాత్రలు తక్కువని, గౌతమ్ మేనన్తో పనిచేయడం గొప్ప అనుభూతి అని తెలిపారు.