News August 12, 2024
KMR: రైతు ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే..?
పట్టాదారు పుస్తకం ఇవ్వకుండా RI ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన పెద్ద కొడప్గల్ మండల తహశీల్దార్ కార్యాలయంలో జరిగింది. వడ్లం గ్రామానికి చెందిన రైతు అంజయ్య గత కొన్ని నెలల కిందట పట్టాదారు పాసు పుస్తకం కోసం RI పండరికి రూ.20 వేలు చెల్లించిన్నట్లు బాధితుడు తెలిపాడు. కాగా, ఈరోజు ప్రజావాణిలో పురుగు మందు తాగాడు. అధికారులు అడ్డుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Similar News
News September 7, 2024
కామారెడ్డి: వైద్య కళాశాలలో ఆచార్య పోస్టుల భర్తీకి ప్రకటన
కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆయా విభాగాలకు అసోసియేట్, సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి ప్రిన్సిపల్ శివకుమార్ తెలిపారు. అనాటమీ అసోసియేట్ 1, అసిస్టెంట్ 1, ఫిజియోలాజీ అసిస్టెంట్ 1, బయో కెమిస్ట్రీ అసోసియేట్ 1, జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ 1, సైక్రియాట్రి అసోసియేట్ 1, జనరల్ సోషల్ సర్జరీ 1, తదితర పోస్టులకు ఈ నెల 12న వైద్య కళాశాలలో మౌఖిక పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News September 7, 2024
అమెరికాలో మధుయాష్కి గౌడ్‌ను కలసిన జుక్కల్ ఎమ్మెల్యే
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అమెరికా దేశ పర్యటనలో భాగంగా శనివారం అమెరికాలోని డల్లాస్ ఎయిర్ పోర్టులో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్, ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు.
News September 7, 2024
బిక్కనూర్లో వదినను హత్య చేసిన మరిది.. UPDATE
బిక్కనూర్‌లో వదినను మరిది <<14035950>>హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. భగీరథిపల్లికి చెందిన పోచయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు రాములు, రెండో భార్యకు మల్లేశం, సురేశ్ ముగ్గురు కుమారులు ఉన్నారు. భూమి విషయంలో సురేశ్‌కు రాములు భార్య లావణ్యతో తరచూ గొడవ జరుగుతుండేది. ఈక్రమంలో శుక్రవారం మళ్లీ గొడవ జరగడంతో సురేశ్ ఆమెను కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు SI సాయికుమార్ వెల్లడించారు.