News July 7, 2024
KMR: రోడ్డు ప్రమాదంలో మహిళ స్పాట్ డెడ్

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల పరిధిలోని స్టోన్ క్రషర్ వద్ద ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్సై సుధాకర్.. సిబ్బందితో కలిసి ప్రమాద స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News November 25, 2025
NZB: మూడు విడతల్లో జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు

నిజామాబాద్ జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 545 GPలు, 5,022 వార్డులకు ఎన్నికలు జరగనుండగా మొదటి విడతలో బోధన్ డివిజన్లోని 11 మండలాల్లో 184 GPలు, 1,642 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో NZB డివిజన్లోని 196 GPలు, 1,760 వార్డులకు, మూడో విడతలో ఆర్మూర్ డివిజన్లోని 12 మండలాల్లో 165 GPలు, 1,620 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.
News November 25, 2025
నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?

నిజామాబాద్ జిల్లాలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
మొదటి విడత: చందూర్, మోస్రా, రుద్రూర్, వర్ని, కోటగిరి, పోతంగల్, బోధన్, రెంజల్, నవీపేట్, సాలూర మండలాలలో..
రెండో విడత: ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, NZB రూరల్, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల్లో..
మూడో విడత: ఆర్మూర్, బాల్కొండ, కమ్మర్పల్లి, భీమ్గల్, మోర్తాడ్, మెండోరా, నందిపేట్ మండలాల్లో జరగనున్నాయి.
News November 25, 2025
26న BRS సన్నాహక సమావేశం: జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈనెల 29న నిర్వహించనున్న ‘దీక్షా దివస్’ను విజయవంతం చేయడానికి నిజామాబాద్లో ఈ నెల 26న సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 ఒక మైలురాయి లాంటిదని ఆయన పేర్కొన్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందని ఆయన గుర్తు చేశారు.


