News February 13, 2025
KMR: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: ASP

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. బుధవారం మాచారెడ్డిలో ఆమె పర్యటించారు. రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై స్థానిక పోలీసులకు సూచనలు చేశారు. అడిషనల్ ఎస్పీ వెంట రూరల్ సీఐ రామన్, ఎస్ఐ అనిల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Similar News
News December 8, 2025
శబరిమల: 18 మెట్లు దేనిని సూచిస్తాయంటే?

పదునెట్టాంబడిలో మొదటి 5 మెట్లు మనిషిలోని పంచేంద్రియాలను సూచిస్తాయి. వీటిని అదుపులో ఉంచుకుని మందుకు సాగాలనే సారాంశాన్ని అందిస్తాయి. తర్వాత వచ్చే 8 మెట్లు కామం, కోపం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, ద్వేషం అనే 8 రాగద్వేషాలను సూచిస్తాయి. వాటిని వదిలి మంచి మార్గంలో నడవాలని చెబుతాయి. ఆ తర్వాత 3 మెట్లు సత్వ, రజో, తమో అనే త్రిగుణాలకు ప్రతీక. చివరి 2 మెట్లు విద్య, అవిద్యలకు ప్రతీక. <<-se>>#AyyappaMala<<>>
News December 8, 2025
చౌటుప్పల్: ఉప సర్పంచ్ కుర్చీకి భారీ డిమాండ్

పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవికి డిమాండ్ భారీగా పెరిగింది. దీనికి కారణం జాయింట్ చెక్ పవర్ ఉండటమే. ఈ కుర్చీని దక్కించుకోవడానికి ఆశావహులు వార్డు మెంబర్ స్థానంలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో ఈ పదవి కోసం ఏకంగా రూ.5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. వార్డు సభ్యులను తమవైపు తిప్పుకోవడానికి నగదు ఆఫర్లు, రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయనే ప్రచారం స్థానికంగా ఎన్నికల వేడిని రాజేస్తోంది.
News December 8, 2025
షూటింగ్ ప్రపంచకప్లో స్వర్ణం సాధించిన సురుచి

ఖతార్లో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్లో భారత షూటర్ సురుచీ సింగ్ స్వర్ణం సాధించారు. విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సురుచి 245.1 పాయింట్లతో పోడియం ఫినిష్ చేసి జూనియర్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. హర్యానాకు చెందిన సురుచి ఈ ఏడాది బ్యూనస్ ఐరీస్, లిమా వేదికలపై కూడా వరుసగా గోల్డ్ మెడల్స్ గెలిచారు.


