News March 2, 2025
KMR: లారీ-కారు ఢీ.. ఒకరు మృతి

ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ వద్ద శనివారం రాత్రి లారీ-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయయ్యాయి. క్షతగాత్రులు నాగిరెడ్డిపేట్ మండలం రాఘవపల్లి తండాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Similar News
News January 7, 2026
UPDATE.. NZB: కాంగ్రెస్ నేత సునీల్ రెడ్డికి బెయిల్

ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీగా, కాంగ్రెస్ బాల్కొండ ఇన్ఛార్జి సునీల్ రెడ్డిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన రూ.28.24 కోట్ల జీఎస్టీని వినియోగదారుల నుంచి వసూలు చేసి, దాన్ని ప్రభుత్వానికి చెల్లించలేదని అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.
News January 7, 2026
NZB: సమస్యలను తీర్చేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోంది: CP

దివ్యాంగుల సమస్యలను తీర్చేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని NZB పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. బుధవారం నిర్వహించిన డాక్టర్ లూయి బ్రెయిలీ 217వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడిన దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం అధిగమించే దిశగా ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
News January 7, 2026
NZB: ఉన్నత విద్యా మండలి ఛైర్మన్కు అతిథి అధ్యాపకుల వినతి

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి బుధవారం సందర్శించారు. డిగ్రీ కళాశాల అతిథి అధ్యాపకులకు ఎంటీఎస్ విధానం, ఉద్యోగ భద్రత కల్పించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఛైర్మన్ ఈ అంశం తమకు అవగాహన ఉందని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.


