News April 16, 2025

KMR: లారీ ఢీకొని యువకుడి మృతి

image

KMR మండలం దేవునిపల్లి పీఎస్ పరిధిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట్ మండలం నాగంపేటకు చెందిన వినోద్ కుమార్(30) అతని స్నేహితుడు దేవేందర్ కామారెడ్డికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఉగ్రవాయి మైసమ్మ వద్ద లారీ ఢీకొట్టింది. వారిని ఆసుపత్రికి తరలించగా వినోద్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News December 13, 2025

MBNR: గెలుపు కోసం.. గౌను ధరించాడు..!

image

మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్ 1వ వార్డు అభ్యర్థి నారాయణగౌడ్ తన ఎన్నికల గుర్తు ‘గౌను’ను ప్రచారం కోసం వినూత్నంగా ఉపయోగించారు. గుర్తు అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో ఆయన గౌను ధరించి తమ వార్డులో ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ఈ ప్రచార పద్ధతి స్థానికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. నారాయణ గౌడ్ ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆసక్తిగా చూశారు.

News December 13, 2025

IHFMS టెండర్లలో భారీగా అవకతవకలు!

image

రాష్ట్రంలోని ప్రభుత్వ టీచింగ్, మెడికల్ కాలేజీల్లో శానిటేషన్, పేషెంట్ కేర్ సేవలను మెరుగుపరిచేందుకు తెచ్చిన నూతన పాలసీకి కాంట్రాక్టర్లు అడ్డంకిగా మారారు. 2024లో కాంట్రాక్టు అసోసియేషన్ కోర్టుకు వెళ్లగా, ప్రభుత్వం నేటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ప్రతీ కాంట్రాక్టర్ నెలకు లక్షల ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

News December 13, 2025

నిర్మల్: మంత్రాల నేపంతో హత్య చేసి.. కాల్చేశారు..!

image

మంత్రాల నేపంతో వ్యక్తిని హత్య చేసి కాల్చి బూడిద చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖానాపూర్ CI అజయ్ ప్రకారం.. కడెం మం. గండిగోపాల్పూర్‌కు చెందిన దేశినేని భీమయ్య(55)ను అదే గ్రామానికి చెందిన నరేశ్, మల్లేశ్ ఈనెల 10న భీమయ్యాను కర్రలతో కొట్టి హత్య చేశారు. అనంతరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి బూడిద చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేశారు.