News April 5, 2025
KMR: లోన్ యాప్స్ వేధింపులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలి

ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులు భరించలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సదాశివనగర్‌కు చెందిన సందీప్(29) HYDలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సందీప్ ఆన్‌లైన్ లోన్ యాప్స్ ద్వారా రుణం తీసుకున్నాడు. ఏజెంట్లు ఇబ్బందులు పెట్టడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 9, 2025
ప్లీజ్.. ప్లీజ్ అని అడుక్కుంటున్నారు: ట్రంప్

టారిఫ్‌ల విషయంలో కొన్ని దేశాలు తనను బతిమాలుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘ప్లీజ్.. ప్లీజ్ సార్. మీతో ఎలాంటి డీల్‌కైనా సిద్ధం. ఇందుకోసం ఏమైనా చేస్తాం అని కొన్ని దేశాలు వెంపర్లాడుతున్నాయి. అయినా నేను అన్నీ తెలిసే టారిఫ్‌లను విధించా. వీటిని మళ్లీ పున:సమీక్షించే ఛాన్సే లేదు. సుంకాల దెబ్బకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. KISSING MY A**’ అంటూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.
News April 9, 2025
రూ.కోటి పనులకు భూమి పూజ చేసిన కలెక్టర్

కృష్ణాజిల్లా మొవ్వలో కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్, డ్రైనేజీ నిర్మాణ పనులకు కలెక్టర్ బాలాజీ గురువారం ఉదయం భూమి పూజచేశారు. వేద పండితులు వేదమంత్రోచ్ఛారణ పూజా కార్యక్రమాలు నిర్వహించగా కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
News April 9, 2025
HYD: అక్కడ అన్ని పుస్తకాలు చవక..!

HYDలోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ నాంపల్లి గ్రౌండ్లో పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. ఏప్రిల్ 17వ తేదీ వరకు కొనసాగుతుందని, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. సాహిత్యం, నాట్యం, సంగీతం, జీవితచరిత్రలు, ఆదివాసి జీవన విధానం, అనేక పరిశోధన గ్రంథాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.