News February 8, 2025
KMR: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, టాయిలెట్స్, కిచెన్, స్టోర్ రూంలను పరిశీలించారు. ప్రతీ రోజు వంట గదిని శుభ్ర పరచాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఫిజికల్ ఫిట్నెస్, భోజనం, తదితర విషయాలపై ఆరా తీసి వారికి దిశా నిర్దేశం చేశారు.
Similar News
News March 26, 2025
శ్రీకాకుళం: ‘కెమికల్ ఇంజనీర్లకు విపరీతమైన గిరాకీ’

శ్రీకాకుళం జిల్లాలో కెమికల్ ఇంజినీర్లకు విపరీతమైన డిమాండు ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఫార్మా రంగంలో జిల్లా వేగంగా అభివృద్ది చెందుతోందని చెప్పారు. అమరావతిలో బుధవారం సీఎం సమక్షంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన తన జిల్లా ప్రగతి గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో ఫార్మా సంస్థల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్నారు.
News March 26, 2025
వనపర్తి POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా వనపర్తి డీసీసీ చీఫ్‌గా రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ఉన్నారు. అయితే ఈ పదవి కోసం చీర్ల చందర్, సాయిచరణ్ రెడ్డి, L.సతీశ్ ఆశావహులుగా ఉన్నారు.
News March 26, 2025
SHOCK: మరికొన్ని రోజుల్లో ఆర్థికమాంద్యం!

2025 ద్వితీయార్థంలో ఆర్థికమాంద్యం వస్తుందని USలో మెజారిటీ కార్పొరేట్ ఫైనాన్స్ చీఫ్స్ అంచనా వేస్తున్నారు. ట్రంప్ టారిఫ్స్, రాజకీయ, ఆర్థిక అనిశ్చితి, కన్జూమర్ కాన్ఫిడెన్స్ దెబ్బతినడమే ఇందుకు కారణమని CNBC CFO కౌన్సిల్ సర్వేలో అభిప్రాయపడ్డారు. మాంద్యం వస్తుందని 3 నెలల క్రితం 7% మంది అంచనా వేయగా ఇప్పుడీ సంఖ్య 60%కి చేరుకుంది. 2026లో ఆర్థిక వ్యవస్థ సంకోచం మొదలవుతుందని మరో 15% అంచనా వేశారు.