News February 14, 2025
KMR: విద్యార్థుల సేఫ్టీకి..జిల్లా కలెక్టర్ తొలి అడుగు..!

పాఠశాలలో విద్యార్థులపై లైంగిక దాడులు జరగకుండా ఉండేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తొలి అడుగు వేశారు. తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా కామారెడ్డి జిల్లాలో ప్రతి పాఠశాల నుంచి ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌ను నియమించారు. శుక్రవారం కళాభారతిలో సమావేశం నిర్వహించి పోక్సో చట్టం పై ఓరియన్టేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోక్సో చట్టంలో నిర్దేశితమైన బాధ్యతల గురించి వివరించారు.
Similar News
News March 25, 2025
మెదక్ పట్టణంలో ATM వద్ద మోసాలు.. జాగ్రత్త

మెదక్‌లో ఓ బ్యాంక్ ATM వద్ద ఇద్దరు వ్యక్తులు డబ్బులు డ్రా చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ATM వద్ద నిలబడి ఎవరికైతే డబ్బులు డ్రా చేయడం రాదో వారినే టార్గెట్ చేస్తూ డబ్బులు తీసి ఇస్తానని చెప్పి కార్డును మార్చేస్తున్నారు. తన దగ్గర ఉన్న మరో కార్డును వారికిచ్చి అక్కడ నుంచి వెళ్లి వేరే ప్రాంతాల్లో డబ్బులు డ్రా చేస్తున్నట్లు టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఈ కొత్త తరహా మోసాలతో జాగ్రత్తంగా ఉండాలన్నారు.
News March 25, 2025
MTM: ఎస్సీల సంక్షేమానికి రూ.341 కోట్ల బడ్జెట్ : శ్రీదేవి

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.341 కోట్ల బడ్జెట్ కేటాయించిందని, వచ్చే ఏప్రిల్ మొదటి వారంలో వివిధ పథకాలు ప్రకటించనున్నట్లు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. మంగళవారం మచిలీపట్నం వచ్చిన ఆమె ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు నివాళులర్పించి మాట్లాడారు.
News March 25, 2025
దీపక్ హుడాకు అబ్బాయిలంటే ఇష్టం: స్వీటీ

కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడాపై ఆయన భార్య స్వీటీ బూరా సంచలన ఆరోపణలు చేశారు. హుడాకు అబ్బాయిలంటే ఆసక్తి అని చెప్పారు. తాను విడాకులు ఇవ్వమని కోరుతున్నానని, ఎలాంటి ఆస్తిని అడగట్లేదని పేర్కొన్నారు. దీపక్ తనను దారుణంగా వేధించడమే కాకుండా చెడుగా చిత్రీకరిస్తున్నాడని తెలిపారు. కాగా దీపక్ తనను వేధిస్తున్నాడని స్వీటీ పోలీసులకు <<15878772>>ఫిర్యాదు చేసిన<<>> సంగతి తెలిసిందే.