News March 19, 2025

KMR: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య ఉపకేంద్ర నిర్మాణ పనుల్లో అపశృతి చేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రాములు(42) అనే వ్యక్తికి బుధవారం పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తాకడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

Similar News

News January 3, 2026

కేసీఆర్, జగన్ ఏపీకి మేలు చేయాలని చూశారు: ఉత్తమ్

image

TG: గతంలో కేసీఆర్, జగన్ చర్చించుకొని ఏపీకి మేలు చేయాలని చూశారని మంత్రి ఉత్తమ్ కుమార్ అసెంబ్లీలో PPT సందర్భంగా ఆరోపించారు. ‘గోదావరి జలాలను రాయలసీమకు తీసుకెళ్తామని కేసీఆర్ అన్నారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని చెప్పింది ఆయనే. ఏపీ-తెలంగాణ వేర్వేరు కాదన్నారు. 2015లో కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల వాటాకు అంగీకరించిందే కేసీఆర్ అని’ పునరుద్ఘాటించారు.

News January 3, 2026

త్వరలో అక్కడ మల్కాజిగిరి.. ఇక్కడ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లు..!

image

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో గత రాచకొండ నూతన పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పుడు రాచకొండను మల్కాజిగిరిగా పేరు మార్చిన వేళ, ఇదే మల్కాజ్గిరి కమిషనరేట్‌గా మేడిపల్లిలో అందుబాటులోకి రానుంది. మరోవైపు.. HYD శివారులో ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం స్కిల్ యూనివర్సిటీ సమీపంలో 150 ఎకరాలు కేటాయించడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిషనరేట్ అక్కడ ఏర్పాటు కానుంది.

News January 3, 2026

ఉల్లి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

image

AP: ప్రకృతి వైపరీత్యాలు, ధరల పతనంతో నష్టపోయిన ఉల్లి రైతులకు ప్రభుత్వం చేయూతనందించింది. ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో హెక్టార్‌కు రూ.20 వేల చొప్పున నగదును మంత్రి అచ్చెన్నాయుడు జమ చేశారు. కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతుల అకౌంట్లలో రూ.128.33 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. కర్నూల్ జిల్లాల్లోనే 31,352 మంది ఖాతాల్లో రూ.99.92కోట్లు జమైనట్లు ప్రభుత్వం పేర్కొంది.