News March 18, 2025

KMR: వైకల్యాన్ని ఓడించి..ఉద్యోగం సాధించి..! అంతే గాక..

image

ప్రతిభకు అంగవైకల్యం అడ్డురాదని నిరూపించారు జుక్కల్ మండలం మొహ్మదాబాద్ వాసి ముక్తబాయి. పుట్టుకతోనే అంధురాలైనా.. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో ఇటీవల గ్రూప్- 4కు ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంచర్ల రెసిడెన్షియల్ పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతే గాక తన పింఛన్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీడీవోకు వినతి పత్రం అందించి ఆదర్శంగా నిలిచారు.

Similar News

News November 4, 2025

పాఠశాలల నిర్వహణ మెరుగుపడాలి: NZB కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరు మరింతగా మెరుగుపడేలా అంకితభావంతో కృషి చేయాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం అన్ని మండలాల ఎంఈఓలతో విద్యా శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపి మాట్లాడారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను బోధిస్తూ, ఫలితాలు గణనీయంగా మెరుగుపడేలా చూడాలన్నారు. ప్రత్యేకించి పదో తరగతిలో ఉత్తీర్ణత మెరుగుపడాలన్నారు.

News November 4, 2025

నిజామాబాద్: ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్

image

నిజామాబాద్‌లోని వినాయకనగర్‌లో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడ పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ పాల్గొన్నారు.

News November 4, 2025

NZB: 6,568 మంది రైతులకు రూ.30.80 కోట్ల బోనస్ చెల్లింపు

image

వానకాలం సీజన్‌కు సంబంధించిన NZB జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన 6,568 మంది రైతులకు రూ.30.80 కోట్లు బోనస్ చెల్లించినట్లు DSO అరవింద్ రెడ్డి తెలిపారు. ఈ రైతుల 6,16,110 క్వింటాళ్లకు సంబంధించి రూ.500 చొప్పున బోనస్ చెల్లించామన్నారు. జిల్లాలోని 487 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,90,616 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు ఆయన వివరించారు.