News May 18, 2024
KMR: వ్యక్తి ప్రాణం తీసిన వడ్ల కుప్ప
రోడ్డు పై ఉంచిన వడ్ల కుప్ప ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ ఘటన పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలోశనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకెళితే.. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలానికి చెందిన సురేందర్ గొండ బైక్ పై మాసాన్ పల్లి వెళ్లాడు. తిరిగి తన స్వగ్రామానికి వస్తున్న ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పను గమనించకుండా కుప్ప పైకి బైకు ఎక్కించడంతో అదుపు తప్పి కిందపడి అక్కడిక్కడే మృతి చెందాడు.
Similar News
News December 2, 2024
కామారెడ్డి: మద్యం తాగించి మరీ కొడుకును చంపేశాడు!
కామారెడ్డి మండలం ఉగ్రవాయి శివారు బ్రిడ్జి వద్ద రాజు(25) అనే యువకుడిని అతడి తండ్రి సాయిలు <<14765998>>హత్య<<>> చేయించిన విషయం తెలిసిందే. సీఐ తెలిపిన వివరాలు.. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో పాటు చెల్లెళ్లను రాజు నిత్యం వేధించేవాడు. విసిగిపోయిన సాయిలు.. అనిల్‌తో కలిసి ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా రాజుకు మద్యం తాగించి బైక్‌పై బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశారు. 24 గంటల్లోనే పోలీసులు కేసు ఛేదించారు.
News December 2, 2024
కామారెడ్డి: కొడుకును చంపిన తండ్రి
కొడుకును కన్న తండ్రే కడతేర్చిన ఘటన KMRలో చోటుచేసుకుంది. గోసంగి కాలనీకి చెందిన సాయిలు, సాయవ్వల కుమారుడు రాజు మద్యానికి బానిసయ్యి కుటుంబీకులను వేధించేవాడు. వేధింపులు తాళలేక సాయిలు పట్టణానికి చెందిన అనిల్‌తో కలిసి పథకం ప్రకారం నవంబర్ 29న రాజును ఉగ్రవాయి శివారులోకి తీసుకెళ్లి చంపేశారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వారిద్దరిని నిందితులుగా గుర్తించి ఆదివారం అరెస్ట్ చేసినట్లు CI రామన్ వెల్లడించారు.
News December 1, 2024
ఆర్మూర్: వ్యవసాయ పనులకు వెళ్తూ మృత్యువాత
వ్యవసాయ పనులకు వెళ్తూ ఓ రైతు మృత్యువాత పడిన విషాద ఘటన ఇది. పెర్కిట్‌కు చెందిన శ్రీరాం అశోక్ (55) ఆదివారం ఉదయం వ్యవసాయ పనుల కోసం బైక్‌పై వెళ్తుండగా హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం జాతీయ రహదారిపై రిలయన్స్ పెట్రోల్ పంప్ సమీపంలో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆర్మూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.