News February 25, 2025
KMR: శాసన మండలి ఎన్నికలకు సర్వం సిద్ధం..!

శాసన మండలి ఎన్నికలకు కామారెడ్డి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణ కోసం కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ రెవెన్యూ డివిజన్లలో పట్ట భద్రుల ఓటర్లకు 29, ఉపాధ్యాయులకు 25 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సంబంధించి సామాగ్రి కామారెడ్డిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి అధికారులకు ఇప్పటికే రెండు దశల్లో శిక్షణ ఇచ్చారు.
Similar News
News December 3, 2025
124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(C<
News December 3, 2025
చిత్తూరు: డిప్యూటీ MPDOలకు కీలక బాధ్యతలు

చిత్తూరు జిల్లాలో సచివాలయాలను పర్యవేక్షించేలా డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తున్నారు. మండలంలోని 31 మండలాల్లో 504 గ్రామ సచివాలయాలు, 108 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఇప్పటికే 27మంది డిప్యూటీ ఎంపీడీవోలు విధుల్లో చేరారు. సచివాలయాల్లో మెరుగైన సేవలు అందించేలా వీరు పర్యవేక్షణ చేయనున్నారు.
News December 3, 2025
‘సంచార్ సాథీ’తో 7 లక్షల ఫోన్లు రికవరీ: PIB

<<18445876>>సంచార్ సాథీ<<>> గురించి వివాదం కొనసాగుతోన్న వేళ.. ఆ యాప్ గురించి PIB వివరించింది. ఈ ఏడాది జనవరి 17న ప్రారంభమైన ఈ యాప్నకు 1.4 కోట్లకుపైగా డౌన్లోడ్లు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు 42 లక్షల దొంగిలించిన ఫోన్లను బ్లాక్ చేసి, 26 లక్షలకు పైగా మొబైల్లను ట్రేస్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో 7.23 లక్షల ఫోన్లు తిరిగి ఓనర్ల వద్దకు చేరాయని, యూజర్ల ప్రైవసీకి పూర్తి ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది.


