News February 28, 2025
KMR: సంఖ్యాపరంగా ఎక్కువ.. ఓటింగ్ తక్కువ

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కామారెడ్డి జిల్లాలో గురువారం ప్రశాంతంగా ముగిశాయి. కాగా..టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. పురుష టీచర్స్ కంటే.. మహిళా టీచర్ ఓటర్లే ఎక్కువ (1.71 % ఎక్కువ) మంది ఓటేశారు. ఇక జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. మహిళా గ్రాడ్యుయేట్స్ ఓటు వేయడంలో (1.17 % తక్కువ) వెనుక పడ్డారు.
Similar News
News February 25, 2026
తెలుగు యూట్యూబర్ ఆత్మహత్య

తెలుగు యూట్యూబర్ కోమలి (21) ఆత్మహత్యకు పాల్పడింది. వైజాగ్‌కు చెందిన ఆమె హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఉంటూ చదువుకుంటోంది. హాబీగా యూట్యూబ్ వీడియోలు చేస్తూ గుర్తింపు పొందింది. సొంతూరికి చెందిన మరో యూట్యూబర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అఖిల్ రెడ్డితో ప్రేమ విఫలం కావడంతో మనస్తాపంతో ఉరి వేసుకొని చనిపోయిందని తెలుస్తోంది. కాగా అఖిల్ మోసం చేయడంతో బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 25, 2026
టారిఫ్‌లపై ట్రంప్ కీలక ప్రకటన

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే దేశాలపై టారిఫ్‌లు విధించానని, వీటికి చట్టబద్ధత ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. దీనివల్ల US ప్రజలకు పన్నుల భారం తగ్గుతుందన్నారు. టారిఫ్‌ల విషయంలో కోర్టు తీర్పుపై ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని తెలిపారు. దురదృష్టవశాత్తూ దేశంలో సుప్రీంకోర్టు నుంచి పాలన సాగుతోందని మండిపడ్డారు. ఏది ఏమైనా అమెరికాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
News February 25, 2026
అల్లూరి: డోలీ మోత.. దారిలోనే ప్రసవం

అనంతగిరిలో మరో డోలీ మోత ఘటన గిరిజనులు పడుతున్న దుర్భర పరిస్థితిని అద్దం పడుతోంది. మల్లిపాడుకు చెందిన గొల్లూరి సుమిత్రకు పురిటి నొప్పులు రాగా (25) బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు మార్గమధ్యంలో ప్రసవమైంది. రోడ్డు సౌకర్యం లేక 6 కిలోమీటర్లు డోలీ మోతతో గ్రామస్థులు తీసుకొని వెళ్తుండగా ప్రసవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


