News April 2, 2025

KMR: సన్నం బియ్యం పంపిణీ ప్రారంభించిన కలెక్టర్

image

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో సన్నం బియ్యం పథకాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బియ్యం నాణ్యతను, తూకాన్ని ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందుతాయని కలెక్టర్ తెలిపారు. పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా రేషన్ షాపుల్లో అధికారులతో తనిఖీలు చేయించినట్లు పేర్కొన్నారు.

Similar News

News January 3, 2026

జూలూరుపాడు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌పై సస్పెన్షన్‌ వేటు..!

image

జూలూరుపాడు రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. పాపకొల్లులోని సదరు అధికారి నివాసంలో నిబంధనలకు విరుద్ధంగా కలప నిల్వ ఉంచినట్లు తేలడంతో డీఎఫ్ఓ కిష్టగౌడ్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ఆర్ఓ ప్రసాదరావును వివరణ కోరగా సస్పెండ్ చేస్తూ డీఎఫ్ఓ ఉత్తర్వులు జారీ చేసినట్లు ధ్రువీకరించారు.

News January 3, 2026

బస్‌ డ్రైవర్‌ నుంచి దేశాధ్యక్షుడి వరకు

image

వెనిజులా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నామని ట్రంప్ చేసిన <<18751661>>ప్రకటన<<>>తో మదురో పేరు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బస్ డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించి దేశాధ్యక్షుడిగా ఎదిగిన వ్యక్తి మదురో. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన, హ్యూగో చావెజ్‌కు అనుచరుడిగా రాజకీయాల్లో ఎదిగారు. చావెజ్ మరణం తర్వాత 2013లో అధ్యక్షుడయ్యారు. అయితే ఆర్థిక సంక్షోభం, మానవ హక్కుల ఉల్లంఘన సహా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

News January 3, 2026

ఫొటో సిమిలర్ ఎంట్రీలు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా ఫొటో సిమిలర్ ఎంట్రీల ప్రక్రియను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ (జిల్లా ఎన్నికల అధికారి) రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో రివిజన్ మ్యాపింగ్ 56.87 శాతం పూర్తయిందన్నారు. ఓటరు జాబితా స్వచ్ఛత, పారదర్శకత కోసం ఈ ప్రక్రియ కీలకమని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పరిశీలించి అర్హులైన ఓటర్ల వివరాలు సరిచేయాలని ఆదేశించారు.