News February 3, 2025
KMR: సబ్ జైలును సందర్శించిన సౌమ్య మిశ్రా

కామారెడ్డి సబ్ జైలును ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ DG సౌమ్య మిశ్రా సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా జైలులో ఖైదీల యోగక్షేమాలను భోజన వసతులు, న్యాయ సేవ, ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు పలు రికార్డులను పరిశీలించారు. జైలులో గార్డెనింగ్, పరిశుభ్రత నిర్వహణపై అధికారులకు అభినందించారు. కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, ఏఎస్పీ చైతన్య రెడ్డి, తదితరులు ఉన్నారు.
Similar News
News February 10, 2026
పార్వతీపురం: ‘ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి ప్లాన్’

ఓ భార్య భర్తను చంపడానికి ప్రయత్నించిన ఘటన ఇది. పాచిపెంట(M) విశ్వనాథపురానికి చెందిన కిర్ల కుమార్, ఈశ్వరమ్మకు 20ఏళ్ల క్రితం వివాహమైంది. నాలుగేళ్ల నుంచి ఈశ్వరమ్మకు తవిటి నాయుడితో వివాహేతర బంధం ఏర్పడింది. ఇటీవల భర్తకు ఈ విషయం తెలిసింది. దీంతో భార్య పక్కా ప్లాన్‌తో భర్తను పొలం వద్దకు తీసుకెళ్లగా.. అక్కడ ఆమె తన ప్రియుడు, తమ్ముడితో కలిసి భర్తపై కొడవలితో దాడి చేసింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
News February 10, 2026
నెల్లూరు: ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీగా చదువు..!

విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వీటికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతిలో ప్రవేశాలకు తల్లిదండ్రులు ఈనెల 20వ తేదీ నుంచి మార్చి 10వ తేదీలోగా గ్రామ సచివాలయం, MRCలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News February 10, 2026
GNT: శైవక్షేత్రాలకు అదనపు ఆర్టీసీ బస్సులు

శివరాత్రి సందర్భంగా భక్తుల కోసం RTC విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీ కారణంగా అదనపు బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి తెలిపారు. గుంటూరు–1, గుంటూరు–2తో పాటు మంగళగిరి, తెనాలి, పొన్నూరు డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచే శ్రీశైలానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. కోటప్పకొండకు గుంటూరు నుంచి 90, క్వారీ 38, గోవాడకు 34 బస్సులు ఏర్పాటు చేశారు.


