News March 6, 2025

KMR: సారీ మమ్మీ, డాడీ.. ఇక సెలవు

image

కోరుకున్న ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఈ నెల 3న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిట్లం మండలం కోమటి చెర్వు తండాకు చెందిన అశోక్ HYDలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. 3వతేదీన ఇంటి నుంచి వెళ్లి పోయాడు. ‘కోరుకున్న జాబ్ సాధించలేక పోయా.. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎపుడప్పుడూ చనిపోవాలని ధ్యాస ఒక్కటే.. ఇక సెలవు. సారీ మమ్మీ, డాడీ’ అంటూ లేఖ రాసి అదృశ్యమయ్యాడు.

Similar News

News November 17, 2025

జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

image

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, నిమ్మరసం చేర్చి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టిని పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. * తలస్నానం చేసిన జుట్టుకు బ్లాక్ టీని పట్టించి ఇరవైనిమిషాల తర్వాత కడిగేస్తే జిడ్డు తగ్గుతుంది.

News November 17, 2025

HYD: ప్రైవేట్ ట్రావెల్స్‌పై అధికారుల కొరడా

image

రంగారెడ్డి జిల్లాలో రవాణాశాఖ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్‌పై కొరడా ఝుళిపిస్తున్నారు. ఓవర్‌లోడ్ వాహనాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 72 వాహనాలు సీజ్ చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని, నిబంధనల ఉల్లంఘనచేస్తే ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఉప రవాణాశాఖాధికారి సదానందం ఆదేశాలపై చర్యలు కొనసాగిస్తున్నారు.

News November 17, 2025

జిన్నింగ్ మిల్లుల బంద్‌.. రైతుల ఆవేదన!

image

TG: CCI విధానాలను వ్యతిరేకిస్తూ కాటన్ మిల్లర్లు నిరసనకు దిగారు. L1, L2 కేటగిరీలను ఎత్తివేయాలంటూ నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్‌ చేపట్టారు. దీంతో రైతులపై మరో పిడుగు పడినట్లయింది. ఇప్పటికే ‘కపాస్’ యాప్‌లో స్లాట్ బుకింగ్, ఎకరాకు 7 క్వింటాళ్లే కొనుగోలు, తేమ 8-12% మించొద్దన్న నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారు. వానలు తగ్గడంతో తేమ సమస్య ఉండదనుకుంటే బంద్‌తో కొనుగోళ్లు ఆగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.