News March 6, 2025

KMR: సారీ మమ్మీ, డాడీ.. ఇక సెలవు

image

కోరుకున్న ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఈ నెల 3న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిట్లం మండలం కోమటి చెర్వు తండాకు చెందిన అశోక్ HYDలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. 3వతేదీన ఇంటి నుంచి వెళ్లి పోయాడు. ‘కోరుకున్న జాబ్ సాధించలేక పోయా.. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎపుడప్పుడూ చనిపోవాలని ధ్యాస ఒక్కటే.. ఇక సెలవు. సారీ మమ్మీ, డాడీ’ అంటూ లేఖ రాసి అదృశ్యమయ్యాడు.

Similar News

News March 21, 2025

విజయవాడలో 100 బృందాలతో తనిఖీలు 

image

డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నిర్ధేశాను సారం ఈగల్ టీమ్ ఐజీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్, స్థానిక పోలీసులు, డ్రగ్స్ డిపార్ట్ మెంట్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం టీమ్‌గా ఏర్పడి మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలపై దాడులు నిర్వహించారు. ఈగల్ యాంటీ-నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీ ఆకే రవి కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 100 బృందాల ఆధ్వర్యంలో ఆపరేషన్ గరుడను నిర్వహించినట్లు తెలిపారు. 

News March 21, 2025

తెలుగు కామెంటేటర్స్ సిద్ధం.. మీ ఫేవరెట్ ఎవరు?

image

స్టేడియంలో ప్లేయర్లు తమ ఆటతో అలరిస్తే, కామెంటేటర్లు తమ మాటలతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంటారు. ఈక్రమంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీ ప్యానల్‌ను సిద్ధం చేసింది. గతంలో ‘ఉప్పల్‌లో కొడితే.. తుప్పల్లో పడింది’ అనే డైలాగ్ తెగ వైరలైంది. ఈ ప్యానల్‌లో రాయుడు, MSK ప్రసాద్, శ్రీధర్, హనుమ విహారి, సుమన్, ఆశిశ్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణ, అక్షత్ రెడ్డి, శశి, కళ్యాణ్, కౌశిక్, హేమంత్, నందు ఉన్నారు.

News March 21, 2025

తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు

image

జిల్లాలో మొదటిరోజు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఈఓ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 8,627 మంది విద్యార్థులకు గాను మొదటి రోజు 8,616 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 11 మంది గైర్హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు.

error: Content is protected !!