News April 7, 2025
KMR: సీసీ కెమెరాలు ప్రారంభించిన ఏఎస్పీ

మాచారెడ్డి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం కామారెడ్డి ASP చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాచారెడ్డి, పల్వంచ మండల ప్రజలకు సీసీ కెమెరాల అవసరాన్ని వివరించారు. చౌరస్తాలో కెమెరాలు ఏర్పాటు చేయడంలో సహకరించిన షాప్ యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అనిల్ పాల్గొన్నారు.
Similar News
News November 15, 2025
VZM: కుష్టు వ్యాధిపై అవగాహన రథాన్ని ప్రారంభించిన DMHO

జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ నెల 17 నుంచి 30 వరకు ఇంటింటి సర్వే ద్వారా కుష్టు కేసులను గుర్తించే “లెప్రసీ కేస్ డిటెక్షన్ కాంపెయిన్” జరగనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. జీవనరాణి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించే ఆటో ప్రచార రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అన్ని గ్రామాల్లో ప్రజలు ఆరోగ్య కార్యకర్తలకు సహకరించాలన్నారు.
News November 15, 2025
గద్వాల్: డబుల్ ట్రాక్ లేక రైళ్ల ప్రయాణం ఆలస్యం

MBNR నుంచి కర్నూల్ వరకు 130 KM డబుల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం సింగిల్ ట్రాక్ ఉండటం వల్ల రైల్వే క్రాసింగ్ల వద్ద రైళ్లు ఆగిపోయి, తీవ్రంగా ఆలస్యం అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి రోడ్డు, శ్రీరాంనగర్, గద్వాల్, అలంపూర్ వెళ్లే ప్రయాణికులు ముఖ్యంగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News November 15, 2025
విశాఖ: రెండో రోజు 48 ఎంఓయూలు

విశాఖలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు సీఎం చంద్రబాబు సమక్షంలో 48 ఎంఓయూలు జరిగాయి. వైద్యారోగ్యం, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, టెక్స్ టైల్స్, పర్యాటక రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. వీటి ద్వారా రూ.48,430 కోట్ల పెట్టుబడులు, 94,155 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మంత్రులు కందుల దుర్గేష్, టీజీ భరత్, సవిత, సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు.


