News March 23, 2025

KMR: సెలవు దినాల్లో కార్యాలయం తెరచి ఉంచాలి: కలెక్టర్

image

మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ టాక్స్ వంద శాతం వసూలుకు కృషి చేయాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌లతో శనివారం సమీక్ష నిర్వహించారు. LRSపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 31 వరకు సెలవు దినాల్లో కార్యాలయాలు తెరచి ఉంచాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News November 17, 2025

అక్కడ అలా.. ఇక్కడ ‘డీలా’..!

image

మన్యం జిల్లాలో మారుమూల అందాలను వెలికితీస్తున్న అధికారులు.. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న తోటపల్లి బోటుషికారుపై దృష్టి పెట్టకపోవడం శోచనీయం. ఇక్కడ నుంచి మూడు బోట్లను తాటిపూడి తరలించడం గమనార్హం. తాటిపూడిలో బోటు షికారు జోరుగా సాగుతుంటే.. ఇక్కడ డీలా పడింది. తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో బోటు షికారు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

News November 17, 2025

రవితేజ సినిమాలో సమంత?

image

రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించే ఛాన్సుందని తెలిపాయి. గతంలో శివ దర్శకత్వంలో మజిలీ, ఖుషి సినిమాల్లో సామ్ నటించారు. దీంతో మరోసారి ఆమెను దర్శకుడు సంప్రదించినట్లు సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీతో, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో బిజీగా ఉన్నారు.

News November 17, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.1,24,970కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పతనమై రూ.1,14,550 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,73,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.