News February 6, 2025
KMR: సైబర్ మోసాలపై జర జాగ్రత్త..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738785652547_51904015-normal-WIFI.webp)
సైబర్ మోసగాళ్లు అమాయకులను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే నకిలీ ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని, కొంత పెట్టుబడి పెడితే ఎక్కువ సంపాదించవచ్చని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. కామారెడ్డి ఇందిరానగర్ ZPHSలో సైబర్ జాగృత దివస్ సందర్భంగా కానిస్టేబుల్ ప్రవీణ్ అవగాహన కల్పించారు.
Similar News
News February 6, 2025
10న ఆల్బెండజోల్ మాత్రలను అందించండి: భద్రాద్రి కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738845088227_60449256-normal-WIFI.webp)
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 10న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ నులిపురుగులను నివారించే ఆల్బెండజోల్ మాత్రలను అందించాలన్నారు.
News February 6, 2025
ADB: నాగోబా ఆలయ హుండీ లెక్కింపు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738848928948_51600738-normal-WIFI.webp)
కేస్లాపూర్‌లోని నాగోబా జాతర హుండీ లెక్కింపును గురువారం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మెస్రం వంశీయులు, ఆలయ కమిటీ, రెవెన్యూ, దేవాదాయ, ఐటీడీఏ, పోలీస్ శాఖ అధికారుల సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం ఆదాయం రూ.21,08,511 వచ్చినట్లు దేవాదాయ శాఖ ఈవో రాజమౌళి తెలిపారు. పీఠాధిపతి వెంకట్‌రావ్ పటేల్, దేవాదాయశాఖ సీఎఫ్‌వో రవి, ఆలయ కమిటీ ఛైర్మన్ ఆనంద్ రావు తదితరులున్నారు.
News February 6, 2025
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738849812591_1259-normal-WIFI.webp)
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు మహా మండపంలో వేదోచ్చరణతో స్వాగతం పలికి, శేష వస్త్రంతో సత్కరించి, లడ్డు ప్రసాదం అందజేశారు. అంజన్నను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు