News March 22, 2025

KMR: స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచాలి: కలెక్టర్

image

స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష చట్టం అమలు కోసం జిల్లా మల్టీ మెంబర్ అథారిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. స్కానింగ్ కేంద్రాల్లో రికార్డులు, రిజిష్టర్‌ల నిర్వహణ పకడ్బందీగా ఉండేట్లు చూడాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా జడ్జి వర ప్రసాద్ ఉన్నారు.

Similar News

News December 2, 2025

కేయూలో నాన్‌ బోర్డర్లకు నిషేధం

image

కేయూ క్యాంపస్‌లో నాన్‌ బోర్డర్ల ప్రవేశాన్ని నిలిపివేస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. క్యాంపస్‌లో శాంతి, భద్రత కోసం కొత్త మార్గదర్శకాలు ప్రకటించారు. పుట్టిన రోజులు సహా వ్యక్తిగత వేడుకలు, రాత్రి 9 తర్వాత ఫుట్‌పాత్‌లు-బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడడాన్ని నిషేధించారు. నాన్‌ బోర్డర్లు వారం రోజుల్లో హాస్టల్స్ ఖాళీ చేయాలని, బోర్డర్లు తప్పనిసరిగా ఐడీ కార్డు కలిగి ఉండాలన్నారు.

News December 2, 2025

కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. రామలక్ష్మణపల్లి 12.8°C, డోంగ్లి 13, గాంధారి 13.1, నస్రుల్లాబాద్ 13.2, జుక్కల్, బీబీపేట్, మేనూర్, బీర్కూర్ 13.3, బొమ్మన్ దేవిపల్లి 13.5, పెద్ద కొడప్గల్,సర్వాపూర్, పుల్కల్ 13.7, బిచ్కుంద 14, రామారెడ్డి 14.2, లచ్చపేట 14.4, మాక్దూంపూర్ 14.5, పిట్లం 14.6°C.

News December 2, 2025

ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.