News March 22, 2025
KMR: స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచాలి: కలెక్టర్

స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష చట్టం అమలు కోసం జిల్లా మల్టీ మెంబర్ అథారిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. స్కానింగ్ కేంద్రాల్లో రికార్డులు, రిజిష్టర్‌ల నిర్వహణ పకడ్బందీగా ఉండేట్లు చూడాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా జడ్జి వర ప్రసాద్ ఉన్నారు.
Similar News
News April 21, 2025
మర్పల్లి: హిందూ సామ్రాజ్య స్థాపనకు శివాజీ కృషి: స్పీకర్

నేటి యువత శివాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివారం మర్పల్లి మండలం పంచలింగాల గ్రామంలో గ్రంథాలయ మాజీ ఛైర్మన్ కొండల్ రెడ్డితో కలిసి శివాజీ విగ్రహ ఏర్పాటుకు స్పీకర్ ప్రసాద్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. హిందూ సామ్రాజ్య స్థాపనకు శివాజీ పోరాటం చేశారని పేర్కొన్నారు.
News April 21, 2025
నేటి ముఖ్యాంశాలు

* AP: తెలుగు ప్రజలకు రుణపడి ఉంటా: CBN
* ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
* TG: త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టులకు నోటిఫికేషన్: మంత్రి
* ఎంఐఎం నేతలు విషసర్పాల కంటే ప్రమాదం: బండి
* BRS ఓటమి తెలంగాణకే నష్టం: కేటీఆర్
* IPL: పంజాబ్‌పై ఆర్సీబీ విజయం
News April 21, 2025
కొల్హాపూర్, కామాఖ్యలో ఆలయాలను దర్శించుకున్న సూర్య దంపతులు

తమిళ నటుడు సూర్య తన భార్య జ్యోతికతో కలిసి పుణ్యక్షేత్రాల్ని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి, అస్సాంలోని కామాఖ్య ఆలయాల్లోని శక్తిపీఠాలను తాజాగా దర్శనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను వారు సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. కాగా.. సూర్య నటించిన రెట్రో వచ్చే నెల 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.