News February 8, 2025
KMR: ‘స్థానిక’ ఎన్నికలు.. కాంగ్రెస్, BRS, BJP మంతనాలు

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో కామారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJPకి చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.
Similar News
News October 19, 2025
పోలవరంలో అత్యధిక వర్షపాతం నమోదు

ఏలూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది అధికారులు ఆదివారం తెలిపారు. అత్యధికంగా పోలవరంలో 104.6 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా పెదవేగిలో 4.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముదినేపల్లి 101.2, బుట్టాయిగూడెం 85.4, ఏలూరు 84.8, జంగారెడ్డిగూడెం 80.4, నిడమర్రు 80.2, కొయ్యలగూడెం 79.8, ద్వారకాతిరుమల 73.0, భీమడోలు 49.4 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.
News October 19, 2025
గాజాపై దాడికి హమాస్ ప్లాన్!.. హెచ్చరించిన US

గాజాలోని పౌరులపై దాడి చేయాలని హమాస్ ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా హెచ్చరించింది. ఈ విషయంలో తమకు విశ్వసనీయ సమాచారం ఉందని US విదేశాంగ శాఖ తెలిపింది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పింది. మీడియేషన్ ద్వారా సాధించిన పురోగతిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఒకవేళ హమాస్ దాడి చేస్తే ప్రజలను, సీజ్ఫైర్ ఒప్పందాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
News October 19, 2025
వనపర్తి: జనుంపల్లి వంశస్థుల రాజ ప్రసాదం

నాడు రాజుల పాలనలో ఉన్న నిర్మాణాలు నేడు చరిత్రకు సాక్షాలుగా నిలుస్తున్నాయి. నిజాం కాలంలో సామంత రాజులుగా కొనసాగిన జనుంపల్లి వంశస్థులు మొదట్లో సుగూరు, తర్వాత వనపర్తి ప్రాంతాన్ని సంస్థానం కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. దేశానికి స్వతంత్రం వచ్చే వరకు వీరి పాలన కొనసాగింది.1885లో పట్టణం నడిబొడ్డులో “రామ్ సాగర్ బంగ్లా” నిర్మాణం చేశారు. ప్రస్తుతం ఈ బంగ్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నడుస్తోంది.