News February 7, 2025
KMR: స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటిన పోలీసులు

TG పోలీస్ నిర్వహించిన గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ క్రీడల్లో కామారెడ్డి పోలీసులు సత్తా చాటారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సింధుశర్మ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు క్రీడాకారులను అభినందించారు. జిల్లా పోలీసు శాఖకు వివిధ విభాగాల్లో 2 బంగారు పతకాలు, 5 రజత, 3 కాంస్యం పతకాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.
Similar News
News March 28, 2025
భారత్ ఖాతాలో మరో 3 పతకాలు

ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్-2025లో భారత్ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. ముగ్గురు మహిళా రెజ్లర్లు మెడల్స్ సాధించారు. రీతిక 76 కేజీల విభాగంలో సిల్వర్, ముస్కాన్ (59kgs), మాన్సీ(68kgs) బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. దీంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్ గెలిచిన పతకాల సంఖ్య 5కు (1 సిల్వర్, 4 బ్రాంజ్) చేరింది. ఈ పోటీలు జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జరుగుతున్నాయి.
News March 28, 2025
జనగామలో ఓ సూపర్ మార్కెట్ కు జరిమానా

జనగామ పట్టణంలోని ఓ సూపర్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 26న కాలం చెల్లిన సరుకులను విక్రయించిన నేపథ్యంలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. కాలం చెల్లిన సరుకులు విక్రయించినందుకు సూపర్ మార్కెట్‌కు రూ.10వేలు జరిమానా విధించారు. ఇలాంటి ఘటన పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
News March 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.