News February 8, 2025
KMR: అంతర్జాతీయ ప్రశంసా పత్రం అందుకున్న వైద్యాధికారిణి
భారతదేశంలో మొట్టమొదటిసారి జరిగిన 8 అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్‌లో కాలేయ వ్యాధులకు సంబంధించి రీసెర్చ్ స్టడీ పైన ప్రొఫెసర్ డాక్టర్ అస్మిత వేలే డైరెక్టర్ రిసెర్చ్ డీపీయూ పూణే చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ చైతన్య రమావత్ అందుకున్నారు. కాలేయ వ్యాధులకు సంబంధించి పరిశోధన చేయడం తనకు ఆనందంగా ఉందని చైతన్య రమావత్ తెలిపారు.
Similar News
News February 8, 2025
10 నుంచి బోదకాలపై స్పెషల్ డ్రైవ్
ఫైలిరియాసిస్(బోదకాలు) నివారణకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10న స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించనుంది. ఏపీ సహా 13 రాష్ట్రాల్లోని 111 జిల్లాల్లో 2 వారాలపాటు కొనసాగనుంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటికే వచ్చి ఉచితంగా ఔషధాలు అందిస్తారని, తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. క్యూలెక్స్ దోమల కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీనివల్ల కాళ్లతోపాటు ఇతర శరీర భాగాలు విపరీతంగా వాపునకు గురవుతాయి.
News February 8, 2025
మాజీ మంత్రి రజినీపై అట్రాసిటీ కేసు
AP: మాజీ మంత్రి విడదల రజినీపై చిలకలూరిపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. 2019లో సోషల్ మీడియాలో రజినీపై పోస్టు పెట్టినందుకు తనను సీఐ సూర్యనారాయణ ద్వారా హింసించారని పిల్లి కోటి అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో రజినీ, ఆమె పీఏలతోపాటు అప్పటి సీఐపై కేసు నమోదైంది.
News February 8, 2025
SSMB29లో నానా పటేకర్?
రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో SSMB29 మూవీ షూటింగ్ ఇటీవల మొదలైంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్‌ను మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అటవీ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచరస్ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.