News April 12, 2025

KMR: అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్..!

image

అంతర్రాష్ట్ర దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. KMR ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం మీడియాతో తెలిపిన వివరాలిలా.. గత కొన్ని నెలలుగా కామారెడ్డి హైవే 44 పై ఆగి ఉన్న వాహనాలపై దాడి చేసి విలువైన వస్తువులను దోచుకెళ్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి 7 గురిని పట్టుకున్నామన్నారు. వారి నుంచి మరణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని SP తెలిపారు.

Similar News

News November 12, 2025

ఉపరాష్ట్రపతి విశాఖ పర్యటన వివరాలు

image

ఈనెల 14న ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విశాఖ రానున్నారు. ఆరోజు ఉదయం 8.30 ఎయిర్ పోర్టు నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సీఎం చంద్రబాబుతో కలసి ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో అల్పాహార విందులో పాల్గొంటారు. ఉదయం 8.55కు 30వ సిఐఐ పార్ట్ నర్షిప్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అదే రోజున ఉదయం 11.15కు ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఈ మేరకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి ఏర్పాట్లు చేస్తున్నారు.

News November 12, 2025

జిల్లాలో 7372 ఇళ్ల నిర్మాణం పూర్తి: ప్రకాశం కలెక్టర్

image

జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 7372 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని కలెక్టర్ రాజా బాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గృహ నిర్మాణాలకు సంబంధించి బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గృహాల నిర్మాణం ద్వారా రూ. 17.77 కోట్ల ఆర్థిక ప్రయోజనం లబ్ధిదారులకు మేలు జరిగిందన్నారు. వివిధ నిర్మాణ దశలు పూర్తి చేసుకున్న 11,443 మందికి రూ.18.36 కోట్ల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించిందని తెలిపారు.

News November 12, 2025

MBNR: అథ్లెటిక్స్ ఎంపికలకు 350 మంది హాజరు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17 విభాగాల్లో అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైన వారు నవంబర్ 14 నుంచి 16 వరకు రంగారెడ్డి జిల్లాలోని జింఖానా మైదానంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.