News November 15, 2025

KMR: అంతర్రాష్ట్ర ముఠా నిందితుడిపై PD యాక్ట్ అమలు

image

చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాపై KMR పోలీస్ ఉక్కుపాదం మోపింది. ఈ ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు భాస్కర్ భాపురావ్ చవాన్‌పై కలెక్టర్ ఆదేశాల మేరకు PD యాక్ట్ అమలు చేశారు. అతనిపై KMR, NZB, NRML జిల్లాల్లో 14 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు చెప్పారు. ముఠాలోని మరో ముగ్గురిపై PD యాక్ట్ అమలు చేశారు. ప్రజల్లో భయం సృష్టిస్తున్న వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని SP రాజేష్ చంద్ర హెచ్చరించారు.

Similar News

News November 15, 2025

HYD: శుభం, శోకంలో వారితో గండమే!

image

ఇంట్లో శుభకార్యమైనా, శోకసంద్రమైనా వారి ఆగడాలు ప్రజలకు శాపంగా మారాయి. దావత్ చేస్తే హిజ్రాలు ఆటోలో వచ్చి హంగామా సృష్టిస్తున్నారు. రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. నిరాకరిస్తే దాడులకు దిగుతున్నారు. ఇటీవల చీర్యాలలో గృహయజమానిపై జరిగిన దాడి కలకలం రేపింది. శోకసమయంలో కాటికాపరుల దుశ్చర్యలూ ఆగడం లేదు. దశదిన కర్మలకు శ్మశానాలకే వెళ్లి వేలకు వేలు గుంజేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.

CM పీఠంపై సందిగ్ధం.. రేపు MLAలతో నితీశ్ భేటీ

image

బిహార్ ఎన్నికల్లో NDA 202 సీట్లతో బంపర్ మెజారిటీ సాధించింది. అయితే CM పదవిపై కూటమిలో ఇంకా సందిగ్ధతే ఉంది. ఈ తరుణంలో సీఎం పీఠాన్ని ఆశిస్తున్న నితీశ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం భేటీ కానున్నారు. ‘CM పోస్టుకు వివాదరహిత వ్యక్తి నితీశ్ మాత్రమే అర్హుడు. బిహార్లో ప్రత్యామ్నాయం ఎవరూ లేరు’ అని JDU MLAలు పేర్కొంటున్నారు. కాగా ఫలితాల అనంతరం LJP నేత చిరాగ్ సహా అనేకమంది నితీశ్ నివాసానికి పోటెత్తారు.