News November 21, 2024

KMR: అధికారులతో కలెక్టర్ వీడియో సమీక్ష

image

కులగణన సర్వేను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసి, డేటా ఎంట్రీ ప్రారంభించారని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. గురువారం MPDOలు, MROలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే పనులు ఎన్యుమరేషన్ బ్లాక్ వారిగా పూర్తిచేసి డేటా నమోదు చేయాలన్నారు. ఇప్పటివరకు 11 మండలాల్లో 100%, జిల్లావ్యాప్తంగా 96.3% ఎన్యుమరేషన్ పూర్తయిందన్నారు.

Similar News

News November 21, 2024

నిజామాబాద్: శిక్షణ పూర్తి చేసుకున్న 250 మంది కానిస్టేబుళ్లు 

image

నిజామాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సుమారు 250 మంది పోలీసులు తమ శిక్షణను పూర్తి చేసుకున్నారు. జిల్లాలోని ఎడపల్లి మండలంలో గల జానకంపేట పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో గురువారం పాసింగ్ అవుట్ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ ఇన్‌ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

News November 21, 2024

ప్రజా పాలనకు తిరుగులేని సాక్ష్యం మద్నూర్ ఛైర్మన్ ఎన్నిక: CM

image

మద్నూర్ AMC ఛైర్ పర్సన్‌గా సౌజన్య ఎంపిక కావడంపై CM రేవంత్ రెడ్డి ‘X’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ఇంటర్వ్యూ పద్ధతిలో ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ మహిళల చదువుకు ఆత్మస్థైర్యానికి ప్రోత్సహమిచ్చేలా జరిగిన ఈ ఎంపిక రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టించిందని’ సీఎం పేర్కొన్నారు. ఈ విషయంలో కీలక పాత్ర పోషించిన MLA తోట లక్ష్మీకాంత్ రావు, సహచర మంత్రి వెంకటరెడ్డి, TPCC చీఫ్ మహేశ్ గౌడ్‌లకు అభినందనలు తెలిపారు.

News November 21, 2024

ఆర్మూర్: మహిళను వేధించాడు.. చివరికి అరెస్టయ్యాడు.!

image

మహిళను వేధిస్తున్న ఒకరిని షీ టీం సభ్యులు పట్టుకున్నారు. ఓ మహిళ ఫోన్‌కి ఒక వ్యక్తి అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ, అసభ్యకర సందేశాలను పంపుతూ ఆమెను వేధిస్తున్నాడు. దీంతో సదరు మహిళ షీటీంకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వెంటనే ఆర్మూర్ షీటీం సభ్యులు అతడిని పట్టుకున్నారు. తదుపరి చర్యలకై అతడిని ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.