News March 23, 2025
KMR: అప్పులు తీర్చలేక ఉరేసుకొని ఆత్మహత్య

సదాశివనగర్ మండలం ధర్మరావు పేట గ్రామానికి చెందిన సుంకరి శంకర్(51) కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక అప్పులు చేసి తీర్చే మార్గం కనిపించక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. శంకర్ బిచ్కుంద మండలం నీరడిలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News March 24, 2025
అంబాజీపేట: తలపై ఇనుప గొట్టం పడి యువకుడి మృతి

అంబాజీపేట మండలం చిరుతపూడికి చెందిన యువకుడు డి శ్రీనివాస్ (25) అమలాపురంలో స్లాబ్ పనులు నిర్వహిస్తుండగా తలపై ఇనుప గొట్టం పడి మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఆదివారం శ్రీనివాస్ కూలీలతో కలిసి అమలాపురం పనికి వెళ్లాడు. ఓ భవనం వద్ద కాంక్రీట్ స్లాబ్ పనులు నిర్వహిస్తుండగా పైఅంతస్తు నుంచి ఇనుప గొట్టం తలపై పడింది. చికిత్స నిమిత్తం రాజమండ్రి తీసుకెళ్లగా అక్కడ మృతి చెందాడు.
News March 24, 2025
తిరుపతి: విహార యాత్రకు వస్తుండగా విషాదం

సెలవు రోజున సరదాగా గడుపుదామని ఉబ్బల మడుగు వస్తున్న తమిళనాడు వాసులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన ఆదివారం తడ వద్ద చోటు చేసుకుంది. పెరియా వట్టు వద్ద తమిళనాడు ప్రమాణికుల కారు ఓవర్ స్పీడ్ కారణంగా చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఫాతిమా, దీనా మృతి చెందారు. కాగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు చెన్నైలో చికిత్స అందిస్తున్నారు.
News March 24, 2025
గుంటూరు జిల్లా ఎస్పీ వార్నింగ్

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదివారం ఓ ప్రకటనలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. గతంలో బెట్టింగులకు పాల్పడిన పాత నేరస్తుల వివరాలను సేకరించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అన్నారు.