News February 16, 2025
KMR: అప్పుల బాధ..ఒకే రోజు ఇద్దరి సూసైడ్..!

గాల్లో దీపాల్లా..వ్యక్తుల జీవితాలు మారిపోయాయి. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ..ఆ కుటుంబాల్లో పుట్టెడు దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. కామారెడ్డి జిల్లాలో శనివారం ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఇల్లు నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక.. రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లిలో నర్సింలు సూసైడ్ చేసుకోగా..కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చలేక బుడ్మి వాసి జీవన్ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Similar News
News November 11, 2025
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: టీయూ విద్యార్థి సంఘాలు

తెలంగాణ యూనివర్సిటీలో 2012 లో జరిగిన నియామకాలు చెల్లవని ఇచ్చిన హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని NSUI,PDSU నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సమావేశంలో NSUI, వర్సిటీ మాజీ అధ్యక్షుడు శ్రీశైలం,PDSU నాయకులు అనిల్ కుమార్ మాట్లాడారు.తప్పుడు పత్రాలతో నియామకం అయిన వారిని తొలగించి,హైకోర్టు తీర్పును పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.నాయకులు రాజు, గోవింద్,మహేష్,అరుణ,పవిత్ర,నవీన్ తదితరులున్నారు.
News November 11, 2025
నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగ మేళా

నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 13న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చేసిన యువతి, యువకులు అర్హులని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు. వయస్సు18 నుంచి 30 లోపు వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని తెలిపారు.
News November 11, 2025
NZB: ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు.


