News November 6, 2025

KMR: ఆక్రోశ సభకు బీసీలు తరలిరావాలి: DSP

image

42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో నవంబర్ 15న కామారెడ్డి జిల్లాలో జరుగబోయే బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని జిల్లా ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పార్టీ ఆఫీస్‌లో సమావేశం నిర్వహించారు. జస్టిస్ ఈశ్వరయ్య, చిరంజీవులు, విశారదన్ మహారాజ్‌ల నాయకత్వంలోనే బీసీల 42% రిజర్వేషన్ల చట్టం అమలు సాధ్యమని అన్నారు. జిల్లాలోని బీసీ సమాజమంతా సభకి తరలిరావాలని కోరారు.

Similar News

News November 7, 2025

పొగాకు రైతులకు న్యాయం చేద్దాం: కలెక్టర్

image

ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు, ఫ్యాక్టరీల యాజమాన్యం సమన్వయం చేసుకొని పొగాకు రైతులకు న్యాయం చేద్దామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం రాత్రి బాపట్ల కలెక్టరేట్‌ వద్ద మార్కుఫెడ్ డిఎం, పొగాకు ఫ్యాక్టరీల యాజమాన్యంతో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు, ఫ్యాక్టరీల యాజమాన్యం సమన్వయం చేసుకొని పొగాకు రైతులకు న్యాయం చేద్దామని వివరించారు.

News November 7, 2025

మరో 4 ‘వందేభారత్’లు.. ఎల్లుండి ప్రారంభం

image

దేశంలో మరో 4 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. లక్నో-సహరన్‌పూర్, ఎర్నాకుళం-బెంగళూరు, బనారస్-ఖజురహో, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ మార్గాల్లో ఇవి నడవనున్నాయి. ఎల్లుండి ఉదయం 8.15 గంటలకు వారణాసిలో ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. కాగా ఆగస్టు నాటికి దేశంలో 150 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.

News November 7, 2025

జగిత్యాల: రాయితీ పనిముట్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉద్యాన యాంత్రీకరణలో భాగంగా రైతులకు వివిధ రకాల పనిముట్లు, యంత్రాల కొనుగోలుపై రాయితీ సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యాంప్రసాద్ తెలిపారు. పవర్ టిల్లర్లు, పవర్ విడర్లు, పవర్ స్పెయర్లూ, బ్రష్ కట్టర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు తమ పరిధికి చెందిన ఉద్యాన అధికారులను లేదా జగిత్యాలలోని ఉద్యాన శాఖ జిల్లా కార్యాలయంలో 15లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.