News March 19, 2025
KMR: ఆత్మవిశ్వాసం ఉంటే అద్భుతాలు సాధిస్తారు: కలెక్టర్

దివ్యాంగ విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో ఉంటే జీవితంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. సమగ్ర శిక్షా కామారెడ్డి జిల్లా, భారతీయ దివ్యాంగుల పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ శిబిరాన్ని కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. జిల్లాలో గుర్తించిన 207 మంది దివ్యాంగులకు ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు.
Similar News
News December 15, 2025
విశాఖ పోర్టు పాలన గాడి తప్పుతోందా.?

విశాఖ పోర్టు ఛైర్మన్ అంగముత్తు ముంబైకు బదిలీ అయినా ఇక్కడ ఇన్‌ఛార్జ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. నెలలో ఒకటీరెండు సార్లే విశాఖకు వస్తున్నారు. డిప్యూటీ ఛైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే, సెక్రటరీ వేణుగోపాల్ సైతం ఇతర పోర్టులకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. పూర్తిస్థాయి ఛైర్మన్, డిప్యూటీలు సైతం లేకపోవడంతో పోర్టు పాలన గాడి తప్పుతుందనే విమర్శలు ఉన్నాయి. కీలక ఫైళ్లు ముందుకు సాగడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు.
News December 15, 2025
దీపిక Our Pride

★ ట్రోఫీతో పాటు గ్రామ గుండె గెలిచింది!
SS: కెప్టెన్ <<18556602>>దీపిక<<>> దేశం తలెత్తుకునే విజేత. ఆమె విజయం దేశానికి గర్వకారణం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సమావేశంలో తమ గ్రామానికి రోడ్డు కావాలని కోరడం ఆమె ఉన్నత ఆశయాలకు నిదర్శనం. ‘తెలుగు యువతి అయిన దీపిక సాధించిన విజయం, ఆమె ఆశయాలు గర్వకారణం. గెలుపు ట్రోఫీలో కాదు. గెలిచాక తన గ్రామాన్ని మర్చిపోకపోవడంలో ఉంది. దీపిక Our Pride’ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
News December 15, 2025
నెల్లూరు ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్

నెల్లూరు నగర మేయర్‌గా స్రవంతి చేసిన రాజీనామాకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. కొత్త మేయర్‌ను ఎన్నుకునే దాకా.. కార్పొరేషన్‌లో పరిపాలన వ్యవహారాలకు ఇబ్బంది లేకుండా డిప్యూటీ మేయర్లలో ఒకరిని మేయర్‌గా ప్రకటించాలని కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో కొత్త మేయర్ ఎన్నిక జరిగే వరకు రూప్ కుమార్ యాదవ్ ఇన్‌ఛార్జ్ మేయర్‌గా కొనసాగుతారని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


