News August 27, 2025
KMR: ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి

కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆదర్శ పాఠశాల, కళాశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. జిల్లాలోని ఆరు ఆదర్శ పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News August 27, 2025
టిష్యూ, యాపిల్స్‌తో వినాయకులు.. చూశారా?

వినాయక విగ్రహాల తయారీలో పలువురు తమలోని సృజనాత్మకతను చాటుకుంటున్నారు. ఒడిశాలోని సంబల్‌పుర్‌లో 1,500 కేజీల యాపిల్స్‌తో 28 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు పండ్లతో గణేషుడిని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. గుజరాత్‌లోని సూరత్‌లో టిష్యూ పేపర్లతో పర్యావరణహిత విగ్రహాన్ని తయారు చేశారు. 350 కేజీల టిష్యూతో 16 అడుగుల ఎత్తులో రూపొందించిన ఈ విగ్రహం ఆకట్టుకుంటోంది.
News August 27, 2025
వరంగల్: WOW.. కనురెప్పపై సూక్ష్మ గణపతి

వరంగల్ నగరానికి చెందిన సూక్ష్మ కళాకారుడు మట్టేవాడ అజయ్ కుమార్ కనురెప్పపై సూక్ష్మ గణపతిని రూపొందించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని 120 గంటల పాటు శ్రమించి 0.37మి.మీ ఎత్తులో గణనాథున్ని తయారుచేశారు. అజయ్ కుమార్ అనేక సూక్ష్మ కళాఖండాలను రూపొందించి అనేక అవార్డులు సాధించారు. ప్రత్యేకమైన సూక్ష్మ కళారూపాలను రూపొందిస్తూ అయన ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నారు.
News August 27, 2025
వినాయక చవితి.. మెదక్ ఎస్స్పీ కీలక సూచనలు

గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. అలాగే మండపాలను ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద మహిళలు, యువతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవ్ టీజింగ్‌ను అరికట్టాలని సూచించారు.