News October 28, 2025

KMR: ఆనందడోలికల్లో కొందరు..ఆశలు ఆవిరిగా మరికొందరు!

image

ఎన్నో ఆశలు, మరెన్నో ఉత్కంఠల మధ్య కామారెడ్డి జిల్లాలో వైన్ షాపుల కేటాయింపునకు సంబంధించిన లక్కీ డ్రా సోమవారం పూర్తయింది. డ్రా ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఒక్కో దరఖాస్తుదారు పేరును లాటరీ పెట్టెలోంచి తీసి ప్రకటించారు. విజేతలుగా నిలిచిన అదృష్టవంతుల మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. అయితే, విజేతల ఆనందం పక్కనే, లక్కీ డ్రాలో తమ పేర్లు రాని వారి మొహాలు చిన్నబోయాయి.

Similar News

News October 28, 2025

సిరిసిల్ల: యువతి MISSING.. PHOTO వైరల్..!

image

సిరిసిల్ల(D) చందుర్తి మండలం రామన్నపేటకు చెందిన <<18122962>>ఏరెడ్డి అక్షయ(21)పై MISSING<<>> కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా, ఆమె 5 రోజుల క్రితం రామన్నపేటకు చెందిన బాల్యమిత్రుడు, తెనుగు సామాజిక వర్గానికి చెందిన యువకుడిని లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు సమాచారం. అయితే తాము పెళ్లి చేసుకున్నట్లు యువతి తన తండ్రికి పైఫొటో పంపినట్లు తెలుస్తోంది. ఈ ఫొటో ప్రస్తుతం SMలో వైరల్‌గా మారింది. అక్షయ B.TECH ఫైనల్ ఇయర్ చదువుతోంది.

News October 28, 2025

తుపాను ప్రభావం.. జగన్‌ తాడేపల్లి పర్యటన వాయిదా

image

మొంథా తుపాను ప్రభావంతో విమాన సర్వీసులు రద్దు కావడంతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తాడేపల్లి పర్యటనను వాయిదా వేశారు. గన్నవరం విమాన సర్వీసులు పునరుద్ధరించగానే రేపు ఆయన రావచ్చని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. తుపాను బాధితులు అప్రమత్తంగా ఉండాలని, సహాయ చర్యల్లో పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనాలని జగన్‌ పిలుపునిచ్చారు.

News October 28, 2025

రోజూ ఇలా చేస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుంది: వైద్యులు

image

నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచిస్తున్నారు. ‘రోజూ నిద్రపోయే సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. వారాంతాల్లోనూ ఒకే సమయానికి పడుకుని, మేల్కొంటే శరీరం ఒకే దినచర్యకు అలవాటు పడుతుంది. పడుకునే 30-60 నిమిషాల ముందు టీవీలు, ల్యాప్‌టాప్స్‌కు దూరంగా ఉండాలి. దీనికి బదులు పుస్తకాలు చదవండి. గదిని చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి’ అని చెబుతున్నారు.