News January 6, 2026

KMR: ఆర్థిక సాయం పొందేందుకు దరఖాస్తులు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ మహిళా మైనారిటీ యువజన పథకం’ కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జయరాజ్ కోరారు. జిల్లాలోని పేద ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Similar News

News January 9, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 9, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.22 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.58 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.15 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 9, 2026

నిర్మల్: ఇంటర్ పరీక్షకు 13,125 మంది విద్యార్థులు

image

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం బోర్డు పరీక్షకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం 23 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాల్లో 6,652 మంది ప్రథమ, 6,473 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు మొత్తం 13,125 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు వివరించారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

News January 9, 2026

ఈడీ vs ఐప్యాక్: హైకోర్టుకు చేరిన వివాదం!

image

కోల్‌కతాలోని ఐప్యాక్ ఆఫీసులో ED చేసిన <<18797775>>రెయిడ్స్‌<<>>పై రోజంతా హైడ్రామా నడిచింది. మమత వర్సెస్ ఈడీ అన్నట్లు సాగిన ఈ వ్యవహారం చివరికి కలకత్తా హైకోర్టుకు చేరింది. ఈడీ, ఐప్యాక్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. బెంగాల్ కోల్ మైనింగ్ స్కామ్‌కు సంబంధించి తాము సోదాలు చేశామని, తమను మమత అడ్డుకున్నారని ఈడీ తమ పిటిషన్లో పేర్కొంది. ఈడీ రెయిడ్స్‌ను ఆపేలా ఆదేశించాలని ఐప్యాక్ అభ్యర్థించింది.