News February 28, 2025
KMR: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్నాయి. మార్చి 5 నుంచి షురూ కానున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా.. ఇంటర్ మొదటి సంవత్సరం 8743, ద్వితీయ సంవత్సరం 9726 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలు, 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు 38 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్, ఆరుగురు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు.
Similar News
News March 7, 2026
SVU: పరీక్ష ఫీజు చెల్లించండి.!

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలో డిగ్రీ (UG) 4, 6 సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ నెలలో జరగనున్నట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. మార్చి 21వ తేదీలోపు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News March 7, 2026
స్టీల్ ప్లాంట్ ఉద్యోగి కూతురికి సివిల్స్‌లో 573వ ర్యాంక్

విశాఖకి చెందిన శ్వేత గుమ్మల సివిల్ సర్వీసెస్ పరీక్షలో 573వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటింది. ఆమె తండ్రి రాజాబాబు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి విజయలక్ష్మి గృహిణి. శ్వేత విశాఖలో పాఠశాల విద్య, జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తరువాత IIT హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసింది. కృషి, పట్టుదలతో సివిల్స్‌లో ర్యాంక్ సాధించి కుటుంబానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.
News March 7, 2026
జగిత్యాల: వ్యవసాయానికి బ్యాంకులు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ బీఎస్. లత అన్నారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశం కలెక్టరేట్ ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలో 26 బ్యాంకులు 135 శాఖల ద్వారా సేవలు అందిస్తున్నాయని, మొత్తం బ్యాంకింగ్ వ్యాపారం రూ.16,910 కోట్లకుపైగా ఉందన్నారు. రైతులు, బలహీన వర్గాలు, మహిళలకు బ్యాంకులు మరింత రుణాలు అందించాలని సూచించారు.


