News February 17, 2026
KMR: ఇంటర్ పరీక్షలకు 37 కేంద్రాలు.. 17,953 మంది విద్యార్థులు

కామారెడ్డి జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 37 పరీక్షా కేంద్రాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 17,953 విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 22, 2026
ఓవర్సీస్ విద్యానిధి పథకం.. రేపటి నుంచి దరఖాస్తులు

TG: మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి (₹20L వరకు సాయం) పథకానికి దరఖాస్తుల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు మార్చి 24 వరకు అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం లబ్ధిదారుల సంఖ్యను 300 నుంచి 700కి పెంచింది. ఇందులో BCలకు 500, EBCలకు 200 చొప్పున కేటాయించారు. దరఖాస్తు, పూర్తి వివరాలకు <
News February 22, 2026
సూర్యాపేటలో రేపటి నుంచి ప్రజావాణి

సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కారణంగా ఆగిపోయిన ‘ప్రజావాణి’ కార్యక్రమం రేపటి నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ నెల 23వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో యథాతథంగా ఫిర్యాదులు స్వీకరిస్తామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ప్రజలు తమ పెండింగ్ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని ఆయన సూచించారు. ప్రభుత్వ సేవలలో పారదర్శకత కోసం ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News February 22, 2026
కృష్ణా: సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కృష్ణాలో 63 కేంద్రాల్లో 49,579 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 98 కేంద్రాల్లో 76,900 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, సీసీ కెమెరాల నిఘా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు. గత ఏడాది 14 రోజుల్లో ముగిసిన పరీక్షలు, ఈసారి 23 రోజుల పాటు జరగనున్నాయి.


