News February 20, 2026

KMR: ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో వైద్య శిబిరాలు

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు జిల్లాలో 38 ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ విద్య తెలిపారు. గురువారం ఆమె ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 18 వరకు ఆయా కేంద్రాల్లో పీహెచ్‌సీ సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

Similar News

News February 20, 2026

NLG: ఎన్నికల ఖర్చులో చేతివాటం!

image

జిల్లాలో ఎన్నికలు ముగిసిన తరుణంలో ఇప్పుడు ఖర్చుల లెక్కలపై చర్చ మొదలైంది. ఎన్నికల నిర్వహణ పేరుతో అయ్యే వ్యయంపై సరైన ఆడిట్ వ్యవస్థ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు అధికారులు అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఎన్నికల ఖర్చులను భారీగా పెంచి చూపి, వ్యక్తిగత లాభం పొందిన ఘటనలున్నాయి. ఎన్నికల ఖర్చులపై ఆడిట్ లేకపోవడంతో రూ.లక్షల్లో దుర్వినియోగం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

News February 20, 2026

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని 11 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించే ఈ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పాఠశాలల్లో 2024-25, 2025-28 విద్యా సంవత్సరంలో నిరవధికంగా చదివి ఉండాలని తెలిపారు. ఈ నెల 23 నుంచి మార్చి 31వ తేదీలోపు గేట్ వే ద్వారా ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు.

News February 20, 2026

NTR: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ANU పరిధిలోని కాలేజీలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(బీ.ఆర్క్) విద్యార్థులు R22 బ్యాచ్(రెగ్యులర్) రాయాల్సిన I/V 1, 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు మార్చి 10 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 26లోపు రూ.100 ఫైన్‌తో 27లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ సందర్శించాలని పేర్కొంది.