News April 3, 2025
KMR: ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. రామారెడ్డి మండలం కన్నాపూర్‌లో గురువారం కలెక్టర్ కొబ్బరి కాయ కొట్టి ఇంటి నిర్మాణం పనులను ప్రారంభించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులో ఎరువుల తయారీని పరిశీలించారు. పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News April 4, 2025
వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా వైసీపీ ఓటు?

రాజ్యసభలో వైసీపీ వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోందని నేషనల్ మీడియా పేర్కొంది. వైసీపీ, బీజేడీ (ఒడిశా) పార్టీలు ఓటింగ్ సందర్భంగా తమ ఎంపీలకు విప్ జారీ చేయకపోవడమే దీనికి నిదర్శనమని తెలిపింది. దీంతో ఏడుగురు వైసీపీ ఎంపీలు ఆ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి ఉంటారని వెల్లడించింది. కాగా బిల్లుకు 95 వ్యతిరేక ఓట్లు పడగా అందులో INDI కూటమి 88, BRS 4, అన్నాడీఎంకేవి 3 ఓట్లు ఉన్నట్లు సమాచారం.
News April 4, 2025
పెద్దపల్లి: దరఖాస్తుల గడువు పొడగింపు

రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తులను ఆఫ్ లైన్‌లో సంబంధిత మండల పరిషత్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన కౌంటర్ నందు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తిగల యువకులు నిర్ణిత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News April 4, 2025
కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పూజలు

ఆత్మకూరు పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆర్యవైశ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.