News April 5, 2025

KMR: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: MLC కవిత

image

నీటి నిర్వహణపై అవగాహన లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని.. ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే అని ఉమ్మడి NZB జిల్లా MLC కవిత మండిపడ్డారు. ‘యాదాద్రి భువనగిరి జిల్లా టేకుల సోమారంలో పంటలకు సాగు నీరు అందక చేతికొచ్చే పంటలు ఎండిపోయాయి. పుట్టెడు దుఖంలో ఉన్న రైతులను చూస్తే గుండె బరువెక్కింది. రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్‌ను వదిలిపెట్టేది లేదని’ X వేదికగా ఆమె రాసుకొచ్చారు.

Similar News

News April 6, 2025

రామతీర్థంలో నేడు జరిగే కార్యక్రమాలు ఇవే..!

image

ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరొందిన రామ‌తీర్థంలోని శ్రీరామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపనం, గాయత్రీ రామాయణం, అష్టకలస స్నపన మహోత్సవం, ఉదయం 10.30 గంటలకు ముత్యాలు, తలంబ్రాలతో స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం 9 గంటలకు శ్రీ సీతారాముల పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తారు.

News April 6, 2025

మద్యానికి డబ్బు ఇవ్వలేదని కన్నతల్లి హత్య

image

మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన బీబీన‌గర్ మండలంలో జరిగింది. CI ప్రభాకర్‌ తెలిపిన వివరాలు.. గుర్రాలదండి కొత్తతండాకు చెందిన మోజి(50) రాములు దంపతుల కుమారుడు శ్రీను. భార్యతో కలిసి చేవెళ్లలో ఉంటున్నాడు. APR 4న భార్యతో గొడవపడి తల్లి దగ్గరకు వచ్చాడు. మద్యానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని గొడవ పెట్టుకున్నాడు. కోపంతో మోజి తలపై కర్రతో బలంగా కొట్టి చంపేశాడు.

News April 6, 2025

సూర్యాపేట: నేటి నుంచి నెల రోజులపాటు పోలీసు యాక్ట్

image

సూర్యాపేట జిల్లా పరిధిలో నేటి నుంచి నెల రోజులపాటు పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పరిధిలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా మీటింగులు, ర్యాలీలు, ఊరేగింపులను నిర్వహించొద్దని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నేరమని తెలిపారు. జిల్లాలో డీజే సౌండ్‌లను వినియోగించడంపై నిషేధం కొనసాగుతుందని తెలిపారు.

error: Content is protected !!